అయోధ్యలో అసలు బాబ్రీ మసీదే లేదు: వసీం రిజ్వీ సెన్సేషనల్ కామెంట్స్

శనివారం, 14 జులై 2018 (13:41 IST)

అయోధ్యలో వున్నది మసీదు కాదని.. అది రామ జన్మభూమి అని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  అక్కడ రామ మందిరం మాత్రమే నిర్మించబడుతుందని... బాబర్ సానుభూతిపరులంతా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో అసలు బాబ్రీ మసీదే లేదని స్పష్టం చేశారు. అయోధ్యలో రామ మందిరాన్ని వ్యతిరేకిస్తున్నంతవారంతా పాకిస్థాన్‌కు వెళ్ళిపోవాలన్నారు. 
 
వసీం రిజ్వీ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముస్లిం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మదర్సాలు ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని ఇటీవల రిజ్వీ కామెంట్స్ చేశారు. మదర్సా వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు లేఖలు కూడా రాసిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా రామమందిరంపై రిజ్వీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజ్వీ వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వున్నాయని విమర్శలొస్తున్నాయి.దీనిపై మరింత చదవండి :  
అయోధ్య బాబ్రీ మసీదు రామమందిరం షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు Chairman Ayodhya Masjid Babar Rama Temple Construction Waseem Rizvi Shia Waqf Board

Loading comments ...

తెలుగు వార్తలు

news

27న బ్లడ్ మూన్.. సంపూర్ణ చంద్రగ్రహణం.. అరుదైన దృశ్యం ఆవిష్కృతం

దేశంలో ఈ నెల 27న ఈ శతాబ్ధంలోనే అరుదైన అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చు. 2000 సంవత్సరం జులై ...

news

నారా లోకేశ్ అడిగితే నా సీటు ఇచ్చేస్తా.. చంద్రబాబుపై కృష్ణంరాజు ప్రశంస

మంత్రి నారా లోకేశ్‌ అడగాలేగానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోని ...

news

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ద్రోహిగా మిగిలిపోయారు.. బీజేపీ ఫైర్

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై బీజేపీ సంచలన కామెంట్స్ చేసింది. ఏపీ సీఎం ...

news

వ్యభిచారం చేయడానికి ఇష్టమా? వీఐపీలు రెడీ... రేటు రూ.3 లక్షలు.. నటికి ఆఫర్

వ్యభిచార నిర్వాహకులు తమ వ్యాపారాన్ని గుట్టుచప్పుడుకాకుండా నిర్వహించుకునేందుకు వివిధ ...