శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 6 జులై 2015 (18:39 IST)

ఫ్యామిలీ ప్లానింగ్ అవసరమని ముస్లింలకు చెప్పండి: మోడీకి సూచన

ముస్లింలకు ధీటుగా హిందూ జనాభాను పెంచుకుంటూ పోవడం కాదు.. కుటుంబ నియంత్రణ పాటించాలని ముస్లింలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీయే సూటిగా చెప్పాలని శివసేన సూచించింది. ఈ విషయంలో సంఘ్ చొరవ తీసుకోవాలని, కుటుంబ నియంత్రణ అన్ని మతాలకు కచ్చితంగా వర్తింపజేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని శివసేన డిమాండ్ చేసింది. 
 
ముస్లిం జనాభా నానాటికీ పెరుగుతున్న కారణంగా దేశంలో భాషా సంబంధ, భౌగోళిక పరమైన అసమతుల్యత ఏర్పడుతుందని హెచ్చరించింది. తద్వారా దేశ సమైక్యతకు బీటలువారే ప్రమాదం ఉందని శివసేన స్పష్టం చేసింది. అందుచేత కుటుంబ నియంత్రణ ముస్లింలకు తెలియజేయాల్సిన బాధ్యతను ప్రధాని తీసుకోవాలని, "దేశ చట్టాన్ని గౌరవించాలని, కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యతను గుర్తించాలని ఆయన ముస్లింలకు వివరించాలి. 
 
ముస్లింలు అర్ధరాత్రి వచ్చి తన ఇంటి తలుపు తట్టినా వారి సమస్యలు పరిష్కరిస్తాను అని ప్రధాని హామీ ఇచ్చారు. అదే రీతిలో ముస్లింలు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అవసరం లేదా?" అని శివసేన తన సామ్నా పత్రికలో పేర్కొంది.