శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (17:54 IST)

ఏటీఎం నుంచి రూ.2000 డ్రా చేస్తున్నారా.. వచ్చేశాయ్ నకిలీ నోట్లు... PK అక్షరాలతో...

రూ. 2000 నోట్లకు నకిలీ నోట్లు తయారుచేయడం ఎవడివల్లా కాదని అనుకున్నారు కానీ ఇప్పుడు నకిలీ నోట్లు ఏకంగా ఏటీఎం మిషన్లలో మూలుగుతున్నాయని స్పష్టమైంది. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఏటిఎం సెంటర్లో డబ్బ

రూ. 2000 నోట్లకు నకిలీ నోట్లు తయారుచేయడం ఎవడివల్లా కాదని అనుకున్నారు కానీ ఇప్పుడు నకిలీ నోట్లు ఏకంగా ఏటీఎం మిషన్లలో మూలుగుతున్నాయని స్పష్టమైంది. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఏటిఎం సెంటర్లో డబ్బు డ్రా చేసుకోగా నాలుగు రూ. 2000 దొంగనోట్లు వచ్చేశాయి. దీనితో షాక్ తిన్న సదరు ఖాతాదారుడు నేరుగా వెళ్లి ఎస్బీఐకి ఫిర్యాదు చేశాడు.
 
ఐతే బ్యాంకు అధికారులు మాత్రం ఆ నోట్లతో తమకు సంబంధం లేదనీ, వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసుకోమని చేతులు దులిపేసుకున్నారు. దీనితో సదరు వ్యక్తి లబోదిబోమంటూ పోలీసు స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సదరు ఏటీఎం సెంటర్లో తాము డబ్బు విత్ డ్రా చేయగా వారికి కూడా అవే నకిలీ నోట్లు వచ్చాయి. దీనితో కంగు తిన్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
 
కాగా ఈ నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు బదులు ‘చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని రాసి వుంది. ఇంకా ఎన్నో తేడాలు వున్నాయి. నోటులో PK అనే ఇంగ్లీషు అక్షరాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తానికి ఏటీఎంలలో ఈ నోట్లు దర్శనమివ్వడంతో కరెన్సీని ఏటీఎం మిషన్లో పెట్టేవారు చేతివాటం చూపించారా లేదంటే బ్యాంకు అధికారులే సొమ్ముకు ఆశపడి ఇలా చేశారా అన్నది తేలాల్సి వుంది.