శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 19 ఏప్రియల్ 2018 (14:11 IST)

వ్యభిచార గృహానికి వెళితే సొంత చెల్లెలు కనిపించింది.. ఆ తరువాత?

సృష్టికి మూలం ఆడది.. కానీ అలాంటి ఆడవారికి సమాజంలో భద్రత లేదు. సృష్టి ఆరంభం నుంచి ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు మగాడి చేతిలో స్త్రీ మోసపోతూనే ఉంది. అలాగే ఒక స్త్రీ ఒక నీచుడి చేతిలో మోసపోయింది. దాని ఫలితంగా సొంత అన్నయ్యే.. వ్యభిచారం గృహంలో ఉన్న సొంత చె

సృష్టికి మూలం ఆడది.. కానీ అలాంటి ఆడవారికి సమాజంలో భద్రత లేదు. సృష్టి ఆరంభం నుంచి ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు మగాడి చేతిలో స్త్రీ మోసపోతూనే ఉంది. అలాగే ఒక స్త్రీ ఒక నీచుడి చేతిలో మోసపోయింది. దాని ఫలితంగా సొంత అన్నయ్యే.. వ్యభిచారం గృహంలో ఉన్న సొంత చెల్లెలి దగ్గరకు వెళ్ళాల్సి వచ్చింది. చదువుతుంటే ఇదేదో సినిమా కథలా ఉంది కదూ. నిజంగా జరిగిన సంఘటన ఇది.
 
ఒక వ్యక్తి వ్యభిచార గృహానికి వెళ్ళాడు. ఒక అమ్మాయిని చూపించి ఆమే కావాలి అన్నాడు. రెండు వేలు అవుతుందని అన్నాడు ఆ బ్రోకర్. సరే అని అడిగిన డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకుని రూంలోకి వెళ్ళాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. అతని సొంత చెల్లెలే. మరి సొంత అన్నయ్య అక్కడకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది.. అతని చెల్లెలు అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది.
 
మూడేళ్ళ క్రితం మనీషా అనే 20 యేళ్ళ అమ్మాయి కళాశాల నుంచి ఇంటికి వెళుతోంది. ఎప్పుడో పరిచయం ఉన్న అశోక్ అనే వ్యక్తి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని ఒక వేశ్యా గృహానికి తీసుకుని వెళ్ళిపోయాడు. భయపెట్టి చంపేస్తానని బెదిరించాడు. చివరకు ఆమె వ్యభిచార గృహంలో ఉంచి ఆమె జీవితాన్ని నాశనం చేసేశాడు. మనీషా కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికివెతికి ఇక ఏమీ చేయలేక వదిలేశారు. 
 
తన జీవితంపై ఎన్నో కలలుకన్న మనీషా చివరకు వ్యభిచార గృహంలో నలిగిపోయింది. దీంతో మూడేళ్ళ పాటు వ్యభిచారిణిగా నీచమైన జీవితాన్ని జీవించింది. మూడేళ్ళలో వారి నుంచి తప్పించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేసింది. చివరకు చనిపోవాలనుకున్నా ఆమె వల్ల కాలేదు. దీంతో జీవచ్ఛవంలా మారిపోయింది. 
 
ఇలాంటి సందర్భంలో తాను నివాసముంటున్న బీహార్ రాష్ట్రం బహరి పట్టణంలోని ఒక వ్యాపారి వేశ్యా గృహానికి వచ్చాడు. అతన్ని చూసిన మనీషా వెంటనే తన గురించి చెప్పడం మొదలెట్టింది. దీంతో ఆ వ్యాపారి కన్నీటిపర్యంతమయ్యాడు. మీ వారికి నువ్వు ఇక్కడున్నావన్న విషయాన్ని చెబుతాను అంటూ వెళ్ళిపోయాడు. మనీషా ఇంటికి వెళ్ళి వారి తల్లిదండ్రులకు మీ కుమార్తె ఆచూకీ తెలిసిందని చెప్పాడు. కానీ ఆమె ఎక్కడుందో మాత్రం చెప్పలేదు. మనీషా అన్న తేజ్‌కు అసలు విషయం చెప్పేశాడు. దీంతో అన్న తేజ్ కన్నీంటి పర్యంతమవుతూ ఎలాగైనా చెల్లెలిని కాపాడుకునే ప్రయత్నం ప్రారంభించాడు.
 
పోలీసులు కూడా వ్యభిచార గృహ నిర్వాహకులకే సహకరించడంతో ఏంచేయాలో పాలుపోలేదు. చివరకు తన చెల్లెలిని చూసి ముందు మాట్లాడాలనుకుని లోపలికి వెళ్ళాడు. తనకు అమ్మాయిలు కావాలని బ్రోకర్‌ని అడిగారు. వరుసగా కొంతమంది అమ్మాయిలను చూపించాడు బ్రోకర్. అందులో తన చెల్లి కూడా ఉంది. వెంటనే ఆ అమ్మాయి కావాలంటూ డబ్బులు చెల్లించి లోపలికి తీసుకెళ్ళాడు. ఇద్దరూ కలిసి జరిగిన విషయాన్ని తెలుసుకుని బాధపడ్డారు. ఆ తరువాత బయటకు వెళ్ళిన తేజ్ పోలీసు ఉన్నతాధికారుల సహకారంతో వ్యభిచార గృహాలపై దాడి చేయించి తన చెల్లెలిని ఇంటికి తీసుకెళ్ళాడు. కానీ తన చెల్లెలు వ్యభిచార గృహంలో ఉందన్న విషయాన్ని మాత్రం తల్లిదండ్రులకు ఇప్పటివరకు చెప్పలేదు. తాజాగా జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.