డాక్టర్ రాంగ్ ట్రీట్మెంట్ వల్లే హీరో శ్రీహరి చనిపోయాడు : డిస్కోశాంతి

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (09:12 IST)

హీరో శ్రీహరి మరణంపై ఆయన భార్య, సినీ నటి డిస్కోశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త కామెర్ల వల్ల చనిపోలేదని, డాక్టర్ల రాంగ్ ట్రీట్మెంట్ వల్ల చనిపోయాడనీ ఆరోపించింది. ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, 'వైద్యులు చెప్పినట్టుగా చనిపోయిన రోజుకి శ్రీహరికి జాండీస్ వ్యాధి ఎక్కువగా ఏమీ లేదు.. ఆయనకి హార్ట్ ఎటాక్ రాలేదు. కేవలం ముంబై హాస్పిటల్ రాంగ్ ట్రీట్మెంట్ వల్లనే అయన చనిపోయాడు' అని వివరించింది.
disco shanthi
 
'జ్వరం రావడం వల్లనే ఆయన హాస్పిటల్‌కి వెళ్లాడు. హాస్పిటల్లో చేరిన రోజు మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ఆయన నాతోనూ.. పిల్లలతోనూ మాట్లాడుతూనే ఉన్నారు. అంతలో ‌నాలుక మడతపడినట్టుగా మాటలు ముద్దముద్దగా రావడం మొదలైంది. నేను గట్టిగా పిలవడంతో నర్సులు పరిగెత్తుకు వచ్చారు. 
 
ఆ తర్వాత శ్రీహరిని చూస్తే ముక్కులో నుంచి.. చెవుల్లో నుంచి బ్లడ్ వస్తోంది. దాంతో నన్ను అక్కడి నుంచి పంపించి వేశారు. మా బంధువులు హాస్పిటల్‌కి వచ్చారు.. శ్రీహరి చనిపోయిన విషయాన్ని ఆ రోజు రాత్రి వరకూ నాకు చెప్పకుండా దాచారు' అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వెన్నులో వణుకు.. గుండెల్లో భయం పుట్టే చట్టాలు రావాలి : రేణు దేశాయ్

ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలకు అడ్డుకట్ట పడాలంటే వెన్నులో వణుకు, గుండెల్లో భయం పుట్టే ...

news

'భ‌ర‌త్ అనే నేను' ఫంక్ష‌న్‌కి తార‌క్‌ని పిల‌వ‌డం వెనక ఏం జ‌రిగింది..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ సెన్సేష‌న్ భ‌ర‌త్ అనే నేను. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ...

news

నాకు ఐదేళ్లప్పుడు తెలిసినవారే అలా... అమ్మానాన్నలకు ఏం చెప్పాలి? నటి నివేదా

దేశవ్యాప్తంగా కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులు సంచలనం సృష్టిస్తున్న నేపధ్యంలో పలువురు ...

news

శ్రీహరి అందుకే చనిపోయారు.. రీ ఎంట్రీ ఇస్తున్నా: డిస్కో శాంతి

విలక్షణ నటుడు శ్రీహరి మృతి ఆమెను కలచివేసింది. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే ఆయన సతీమణి, ...