శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (16:55 IST)

ఫార్క్‌కూ, కొలంబియా ప్రభుత్వానికీ మధ్య శాంతి ఒప్పందపు సమావేశానికి శ్రీశ్రీ రవిశంకర్

బెంగళూరు: ఈ నెల 26 వ తేదీన కొలంబియాలోని కార్టాజెనాలో జరిగే శాంతి ఒప్పంద సంతకాల కార్యక్రమానికి శ్రీ శ్రీ రవిశంకర్ హాజరు కాబోతున్నారు. కొలంబియా ప్రభుత్వం, సాయుధ విప్లవ సంస్థ ఫార్క్ మధ్య జరుగుతున్న ఈ శాం

బెంగళూరు: ఈ నెల 26 వ తేదీన కొలంబియాలోని కార్టాజెనాలో జరిగే శాంతి ఒప్పంద సంతకాల కార్యక్రమానికి శ్రీ శ్రీ రవిశంకర్ హాజరు కాబోతున్నారు. కొలంబియా ప్రభుత్వం, సాయుధ విప్లవ సంస్థ ఫార్క్ మధ్య జరుగుతున్న ఈ శాంతి ఒప్పందానికి ఇరు పక్షాల నుండి శ్రీ శ్రీ రవిశంకర్‌కి ఆహ్వానాలు అందాయి. ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాల అధినేత సమక్షంలో జరుగబోతున్న ఈ ఒప్పందానికి ప్రాచ్య దేశాల నుండి హాజరవుతున్న ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ ఒక్కరే కావడం గమనార్హం.
 
కొలంబియాలో శాంతి స్థాపన కోసం శ్రీ శ్రీ రవిశంకర్ చేసిన కృషికి కొలంబియా అధ్యక్షుడు జువాన్ ధన్యవాదాలు తెలుపుతూ, శ్రీశ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఈ రెండు శాంతి స్థాపనలో నిజమైన హీరోలు అని కొనియాడారు. భారత్‌లో కొలంబియా రాయబారి మోనికా లాంజెటా ముటిస్ మాట్లాడుతూ.. గత ఆగష్టు 24వ తేదీన ఈ ఒప్పందం కుదరడంలో శ్రీ శ్రీ రవిశంకర్ పాత్రను శ్లాఘించారు.
 
లాటిన్ అమెరికా దేశాలన్నింటిలోను ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అనేక మాననీయ కార్యకలాపాలను, మానసిక ఒత్తిడి నిర్మూలనా కార్యక్రమాలను అమలు చేస్తోంది. 2015 జూన్ నెలలో కొలంబియా అధ్యక్షుని కలిసిన రవిశంకర్ కొలంబియాలో శాంతి స్థాపనకు తాను చేయగలిగింది చేస్తానని మాట ఇచ్చారు. ప్రపంచం అంతటినీ మానసిక ఒత్తిడి, హింస లేని ప్రపంచంగా మార్చాలన్న రవిశంకర్ ఆశయం మేరకు లాటిన్ అమెరికాలో చాలా ఏళ్లుగా నలుగుతున్న ఈ సంక్షోభానికి సమాధానం లభించింది. బోగోటాలో కొలంబియా ప్రభుత్వ సత్కారాన్ని స్వీకరించిన అనంతరం రవిశంకర్ హవానా వెళ్లి అక్కడి ఫార్క్ కమాండర్లతో మూడు రోజులపాటు చర్చలు జరిపారు. 
 
ఈ సందర్భంగా ఆయుధాలు విడనాడి గాంధీ సూచించిన అహింసా మార్గంలో వారి ఆకాంక్షల కోసం పోరాడాల్సిందిగా వారిని కోరారు. మొదట్లో విముఖత ప్రదర్శించినా చివరి రోజును ఫార్క్ చర్చలకు నాయకత్వం వహించిన ఇవాన్ మర్కెజ్ మాట్లాడుతూ '' గాంధేయ విధానాలను కొలంబియా అనుసరిస్తుందని ఆశిస్తున్నాం'' అని పేర్కొన్నాడు. అంతేకాకుండా, కొలంబియాలోని భారత రాయబార కార్యాలయంలో రవిశంకర్ ఆధ్వర్యంలో ఒక యోగ, ధ్యాన శిబిరానికి అక్కడి గెరిల్లా నాయకులు సైతం హాజరయ్యారు. ఇది జరిగిన వారం రోజుల్లోపే అక్కడ చర్చల పరిస్థితులు మరలా దిగజారడంతో రవిశంకర్ స్వయంగా ఇవాన్ మర్కెజ్‌తో మాట్లాడి శాంతి స్థాపనకు సహకరించాల్సిందిగా కోరారు. ఈ చర్చలు ముందుకు సాగే ప్రయత్నం చేయకపోతే అక్కడి మానవ సమాజం మొత్తానికే హాని కలిగే పరిణామాలను వివరించారు. 
 
ఈ మాటల అనంతరం జూలై 2015న ఇవాన్ మర్కెజ్, ఫార్క్ కార్యదర్శుల బృందం ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించాయి. శాంతి స్థాపనలో కీలకమైన ఈ కాల్పుల విరమణే దాదాపు యేడాది పాటు సాగి అంతిమంగా శాంతి ఒప్పందానికి మూలాధారంగా నిలిచింది. అనంతర కాలం ఇవాన్ మర్కెజ్, రవిశంకర్ ప్రవచనాలను, జ్ఞానం ఈ కాల్పుల విరమణ నిర్ణయం వైపు మళ్లటంలో ప్రభావంతంగా పని చేసినట్టు చెప్పారు. 
 
ఫార్క్ శాంతి బృందానికి సహాయపడే నిమిత్తం లాటిన్ అమెరికా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధ్యక్షుడు ఫ్రాన్సికో మొరెనో ఒకంపో అనేకసార్లు హవానాలో పర్యటించి, ఫాక్క్ నేతలకు ఆర్ట్ ఆఫ్ లివింగి వారి ప్రఖ్యాత "సుదర్శన క్రియ"ను నేర్పారు. దీనిని నేర్చుకున్న నేతలు ఆ అనుభవాన్ని "ప్రశాంతత, స్వేచ్ఛ"ల మేలుకలయికగా అభివర్ణించారు. వారిలో గూడుకట్టుకున్న అభద్రతాభావం, పాతజ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోయాయని వారు గమనించారు. సుదర్శన క్రియపై స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలలో ఈ ధ్యాన ప్రక్రియ మానసిక ఒత్తిడిని నిర్మూలించడంలో అద్భుతంగా పని చేస్తుందని రుజువైంది. 
 
గతంలో ఫార్క్ దళాలు అపహరించి చంపేసిన 12 మంది డిప్యూటీ కుటుంబాలకు, ఫార్క్ నాయకులకు మధ్య ఒక క్షమాశిబిరం నిర్వహించడంలో కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రముఖ పాత్ర పోషించింది. కిడ్నాప్‌కు గురై అనంతరం హతమార్చబడిన ఆ 12 కుటుంబాలలో కేవలం ఒక్కరు మాత్రమే బతికి బట్టకట్టగలిగారు. ఆ కుటుంబాల బంధువులకు, ఫార్క్ దళ సభ్యులకు మధ్య జరిగిన సమావేశంలో ఆ కుటుంబాల వారు తమవారిని కోల్పోయిన అనంతరం తాము పడ్డ బాధలను వివరించినపుడు ఫార్క్ నాయకులు బాధాతప్త హృదయంతో వారిని క్షమాపణ వేడుకున్నారు. "నిజాయితీగా మేము మా తప్పును గుర్తించాము. దానికి బాధ్యతను మేమే తీసుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి" అని చెప్పారు. సమావేశం అనంతరం ఫార్క్ దళ సభ్యులు, డిప్యూటీల కుటుంబ సభ్యుల కలిసికట్టుగా చనిపోయినవారి ఆత్మశాంతికై ప్రార్థనలు జరిపారు. 
 
కొలంబియాలో నెలకొన్న ఈ శాంతి సుస్థిరంగా ఉండేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేక కార్యక్రమాలను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 
 
మరింత సమాచారం కోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు artofliving డాట్ org/peaceincolombia అనే వెబ్‌సైట్‌ను చూడండి.