శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (14:09 IST)

స్కూల్‌కు మొబైల్ తీసుకురావొద్దని మందలించి టీచర్.. విద్యార్థి ఆత్మహత్య

విద్యార్థులు చిన్నపాటి మందలింపులకే మనస్తాపానికిలోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. తాజాగా ఢిల్లీలో ఓ విద్యార్థి .. ఉపాధ్యాయుడు మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
ఢిల్లీ ఘజిపూర్‌కు చెందిన తరుణ్ అనే 16 యేళ్ళ విద్యార్థి స్కూల్‌కి వెళ్లేటప్పుడు రోజూ సెల్‌ఫోను తీసుకెళ్లేవాడు. ఈ విషయమై ఉపాధ్యాయుడు పలుమార్లు విద్యార్థిని హెచ్చరించాడు. తరుణ్‌ తన పద్ధతి మార్చుకోకపోవడంతో ఉపాధ్యాయుడు ఫోన్‌ లాక్కుని మందలించాడు. మరోసారి ఇలా చేస్తేతల్లిదండ్రులకు చెబుతానని బెదిరించాడు. 
 
దీంతో మనస్థాపానికి గురైన తరుణ్‌ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తరుణ్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసుల ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.