Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తీర్పు వెలువడగానే బోరుమన్న శశికళ... నేలపైనే దిగాలుగా కుప్పకూలింది...

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (06:41 IST)

Widgets Magazine
sasikala

జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ బోరుల విలపించారు. తీర్పు వార్తలను టీవీలో ఫ్లాష్ న్యూస్ రూపంలో చూడగానే ఆమె నేలగా దిగాలుగా కుప్పకూలిపోయారు. అలా అర్థగంట సేపు కూర్చూండిపోయారు. ఆ సమయంలో ఆమెను ఓదార్చేందుకు ఏ ఒక్క నేత సాహసం చేయలేదు. 
 
తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో భేటీ కోసం సోమవారం సాయంత్రం కూవత్తూరులోని రిసార్టుకు వెళ్లిన శశికళ.. రాత్రికి అక్కడే బస చేశారు. మంగళవారం ఉదయం అల్పాహారం తీసుకుని మహిళా ఎమ్మెల్యేలతో కలిసి టీవీ ముందు కూర్చున్నారు. తనకు శిక్ష పడినట్లు తెలియగానే ఐదు నిమిషాలకు పైగానే భోరున విలపించారు.
 
ఆ తర్వాత అరగంటపాటు దిగాలుగా నేలపైనే ఆమె కూర్చుండిపోయారు. ఆ తర్వాత తేరుకుని తన వర్గ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో తన స్థానంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పలువురి పేర్లు పరిశీలించినప్పటికీ.. తనకు కుడిభుజంలా వ్యహరించే ఎడప్పాడి పళనిస్వామిని సీఎంగా ఎంపిక చేశారు. 
 
ఆ తర్వాత మంగళవారం రాత్రి 10 గంటలకు రిసార్టు నుంచి పోయెస్ గార్డెన్‌కు బయలుదేరేముందు ఎమ్మెల్యేలనుద్దేశించి శశికళ చివరిసారిగా ప్రసంగించారు. జరుగుతున్న కుట్రలు, వాటి వెనుక ఉన్న నేతలెవ్వరన్నది ఎమ్మెల్యేలంతా గ్రహించే ఉంటారని, అందరూ ఐకమత్యంగా ఉండి పార్టీని కాపాడుకోవాలని సూచించారు. తనకు శిక్ష పడినా, ‘అమ్మ’ ఈ బాధల నుంచి తప్పించుకున్నందుకు ఆనందంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు. పది నిమిషాల ప్రసంగంలో ఆమె నాలుగుమార్లు కన్నీటిపర్యంతమయ్యారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sasikala Jail Supreme Court Party Mlas Free Tn Numbers Game

Loading comments ...

తెలుగు వార్తలు

news

పన్నీర్ ఆశలపై చన్నీళ్లేనా? గవర్నర్‌కు కొత్త పరీక్ష

సుప్రీకోర్టు తీర్పుతో భంగపాటుకు గురైనప్పటికీ శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ ...

news

సైన్యాన్ని రాజకీయాలకు దూరంగా పెట్టడంలో భారత్ ఆదర్శం: పాక్ ఆర్మీ ఛీఫ్

మొత్తం మీద పాక్ సైన్యానికి ఒక విషయం చాలా లేటుగా బోధపడినట్లుంది. సైన్యాన్ని రాజకీయాలతో ...

news

ఇస్రో గ'ఘన' ప్రయాణం: మరి కొద్ది గంటల్లో 104 ఉపగ్రహాలతో కొత్త చరిత్రకు నాంది

ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను పంపిన తొలిదేశంగా చరిత్ర సృష్టించడానికి భారత అంతరిక్ష ...

ప్రపంచాన్ని ఇంకా వదలని హిట్లర్ భూతం: ఆస్ట్రేలియాలో అరెస్ట్‌

ప్రపంచానికి హిట్లర్ సృష్టించిన వివక్షా సిధ్ధాంతం పీడ వదిలిందనుకున్నా హిట్లర్ భూతం మాత్రం ...

Widgets Magazine