Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్వలింగ సంపర్కం నేరమా? సమీక్షించనున్న న్యాయస్థానం

సోమవారం, 8 జనవరి 2018 (15:06 IST)

Widgets Magazine

ఒకే జాతికి చెందిన స్త్రీలు లేదా పురుషుల మధ్య జరిగే శృంగారం (స్వలింగ సంపర్కం) నేరమా అనే అంశంపై సుప్రీంకోర్టు సమీక్ష నిర్వహించనుంది. ఈ తరహా లైంగిక సంబంధాలను నేరంగా పరిగణిస్తున్నారు. దీంతో భారత శిక్ష్మాస్మృతి చట్టంలోని సెక్షన్ 377ను సమీక్షించాలని పలువురు స్వలింగసంపర్కకారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు సమ్మతించింది. 
 
వాస్తవానికి 2013 సంవత్సరంలో స్వలింగ శృంగారాన్ని నేరంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం విదితమే. ఆ తర్వాత స్వలింగ సంపర్కం నేరంకాదంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. 
 
అయితే, వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కులో భాగమేనని ఇటీవలే ఆధార్ విషయంలో సుప్రీకోర్టు స్పష్టంచేసింది. ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌‍జెండర్, క్వీర్ వర్గాలు (ఎల్జీబీటీక్యూ) తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 
 
తాము సహజసిద్ధమైన లైంగిక అవసరాలు తీర్చుకునే విషయంలో పోలీసులను చూసి భయపడాల్సి వస్తోందని వివరించాయి. స్వలింగ శృంగారం నేరమంటున్న సెక్షన్‌ను కొట్టేయాలని కోరాయి. దీంతో సుప్రీంకోర్టు స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, దీనిపై విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యాంకర్ ప్రదీప్ చెప్పినా పట్టించుకోని యువతులు... అర్థరాత్రి తప్పతాగి...

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అర్థరాత్రివేళ మద్యం సేవించి ఇష్టానుసారం కార్లు ...

news

ట్రిపుల్ తలాఖ్: ప్రధాని మోదీపై మండిపడ్డ అసదుద్దీన్

లోక్‌సభలో ప్రవేశపెట్టిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2017కి ప్రతిస్పందిస్తూ ...

news

లాలూ జైలు కాటేజీకి భార్య కూడా అనుమతి... గేదెలు కూడా...

గడ్డి స్కామ్‌లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ...

news

అమ్మకు ప్రత్యక్ష వారసులు లేరు... అమృతకు వేదనిలయం ఇచ్చేది లేదు

తమిళనాడు సర్కారు అమ్మ వారసత్వంపై తొలిసారి అధికారికంగా ప్రకటన చేసింది. తమిళనాడు దివంగత ...

Widgets Magazine