Widgets Magazine

మీకు తెలియకుండానే మీ ఫోన్‌లో చొరపడుతున్న 1947 నెంబర్... అదేం చేస్తుందంటే?

అకస్మాత్తుగా మీకు తెలియకుండానే మీ ఫోనులోకి ఓ నెంబర్ వచ్చి చేరిపోంది. దాని ద్వారా వ్యక్తిగత సమాచారం లీక్ అయిపోతుందేమోనన్న ఆందోళన వుండటం సహజమే కదా. శుక్రవారం నాడు ఇలాంటి ఫోన్ నెంబరు ఒకటి వేలమంది యూజర్ల ఫోన్లలోకి జొరబడి హల్చల్ చేసింది. ఆ నెంబర్ ఏంటయా అం

number
ivr| Last Modified శుక్రవారం, 10 ఆగస్టు 2018 (22:06 IST)
అకస్మాత్తుగా మీకు తెలియకుండానే మీ ఫోనులోకి ఓ నెంబర్ వచ్చి చేరిపోంది. దాని ద్వారా వ్యక్తిగత సమాచారం లీక్ అయిపోతుందేమోనన్న ఆందోళన వుండటం సహజమే కదా. శుక్రవారం నాడు ఇలాంటి ఫోన్ నెంబరు ఒకటి వేలమంది యూజర్ల ఫోన్లలోకి జొరబడి హల్చల్ చేసింది. ఆ నెంబర్ ఏంటయా అంటే 1947. 
 
ఇది ఆధార్‌ కార్డును జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) హెల్ప్‌లైన్ నంబర్ అని తేలింది. ఇప్పుడీ కొత్త నంబర్ ఆటోమెటిగ్గా యూజర్ల కాంటాక్ట్ లిస్ట్‌లోకి చేరిపోవడంతో కొందరు బేజారైపోవడం కనిపించింది. ఓ యూజర్ అయితే భయపడిపోయి ట్వీట్ కూడా చేసేశాడు. తన ఫోన్‌కి గుర్తు తెలియని ఓ నెంబర్ వచ్చి చేరిందనీ, దాన్ని మొబైల్ స్క్రీన్‌ షాట్‌ తీసి పోస్ట్ చేశాడు. 
 
కాగా అసలు తాము ఏ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ లేదా మొబైల్ తయారీ సంస్థ‌ల‌ను నెంబరును జోడించాలని కోరలేదని యూఐడీఏఐ వివ‌ర‌ణ ఇవ్వడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. మరోవైపు ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తన ఆధార్ నంబర్‌ను బయటపెట్టగా ఆయన వివరాలు పూర్తిగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త 1947 నెంబరు ఫోన్లలోకి చొరబడటంతో ఆందోళన కలుగుతోంది. మరి జాగ్రత్త సుమీ.


దీనిపై మరింత చదవండి :