అమ్మను అపస్మారక స్థితిలోనే ఆస్పత్రిలో చేర్చారట.. పెన్ డ్రైవ్‌లో?

బుధవారం, 22 నవంబరు 2017 (14:41 IST)

jayalalithaa

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన వేద నిలయంలో ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో కీలకమైన పెన్ డ్రైవ్ లభ్యమైందని తెలుస్తోంది. వేదనిలయంలోని జయలలిత, శశికళ సహాయకుడు పూంగుండ్రం గదుల్లో ఐటీ అధికారుల తనిఖీల్లో పెన్ డ్రైవ్‌ను లభ్యమైంది. ఆ పెన్ డ్రైవ్‌లో జయలలితను ఆస్పత్రి తరలించేందుకు గంటముందు గల విజువల్స్, ఆస్పత్రిలో చికిత్స సందర్భంగా గల విజువల్స్ వున్నాయని సమాచారం.  
 
జయలలిత మరణంపై ఇప్పటికీ పలు అనుమానాలున్నాయి. తాజాగా లభించిన పెన్ డ్రైవ్ ద్వారా జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరే సమయంలో అపస్మారకస్థితిలో వున్నారని గతంలో ప్రచారం జరిగిన వార్తలకు బలాన్నిచ్చేలా వున్నాయి. ఇప్పటికీ ఈ పెన్ డ్రైవ్ ఐటీ అధికారుల వద్ద వున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. 
 
కాగా.. గత శుక్రవారం రాత్రి వేదనిలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడి సందర్భంగా ల్యాప్‌టాప్‌, టాబ్లెట్, కంప్యూటర్, ఆరు పెన్ డ్రైవ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత అమ్మ నివసించిన పోయెస్ గార్డెన్‌లో ఐటీ దాడులు తొలిసారి నిర్వహించారు. అంతకుముందు 1996లో డీఎంకే అధినేత ఎం కరుణానిధి సీఎం అయిన తరుణంలో వేదనిలయంలో ఇలాంటి దాడులు జరిగాయి.దీనిపై మరింత చదవండి :  
2 Computers Tamil Nadu 6 Pen Drives Veda Nilayam Poyas Garden

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోడీ తల - చేతులు నరికేందురు చాలా మంది సిద్ధంగా ఉన్నారు : రబ్రీదేవి

బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ ...

news

ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా?

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన పదవికి రాజీనామా చేసినట్టు ...

news

సీఎం సాబ్ మీటింగ్‌కు వస్తే బుర్ఖా తొలగించాల్సిందే (వీడియో)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రభుత్వ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రిగా యోగి ...

news

హైదరాబాద్‌కు ఇవాంకా.. కుక్కలకు విషంపెట్టి చంపుతున్న జీహెచ్ఎంసీ

హైదరాబాద్ మహానగరంలో బిచ్చగాళ్లతో పాటు.. వీధి కుక్కలు కూడా మాయమయ్యాయి. ఈనెల 28వ తేదీ నుంచి ...