శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (01:04 IST)

గుండెపోటుతో మరణించిన జయలలిత... శోకసముద్రంలో తమిళ ప్రజలు

ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తుదిశ్వాస విడిచారు. గత సెప్టెంబరు 22వ తేదీ నుంచి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన జయలలిత... ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి గుండెపోటు వచ్చిన విషయం

ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తుదిశ్వాస విడిచారు. గత సెప్టెంబరు 22వ తేదీ నుంచి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన జయలలిత... ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి గుండెపోటు వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఆమెకు అత్యున్నత వైద్య బృందం ఎక్మో విధానంతో చికిత్స అందించారు. అయితే, ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
సోమవారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో కన్నుమూసినట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కొన్నాళ్ల క్రితం కోలుకున్న ఆమె ఆరోగ్యం మళ్ళీ క్షీణించడంతో ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్యబృందాలు రంగంలోకి దిగి చికిత్స అందించారు కానీ.. వారి ప్రయత్నాలు ఫలించలేదు. 
 
ద్రవిడ, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జయ.. ఇక లేరన్న వార్త విని తమిళ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్నో పథకాలతో పేదోడి కన్నీళ్లను తుడిచిన అమ్మ మృతిచెందారన్న వార్తని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అమ్మ ఆరోగ్యంగా తిరిగిరావాలని గత రెండు నెలలకుపైగా వారు చేసిన ప్రార్థనలు ఫలించలేదు.
 
కాగా... 1948 ఫిబ్రవరి 24వ తేదీన జన్మించిన జయలలిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. అప్పట్లో కథానాయకిగా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఎంజీఆర్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన జయ.. ఆయన మరణానంతరం 1991 నుంచి 1996 వరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం మళ్లీ 2001లో మే 14 నుంచి సెప్టెంబర్‌ 21 వరకూ, 2002 నుంచి 2006 వరకూ, 2011 నుంచి 2014 వరకూ, మే 23, 2015 నుంచి మే 19, 2016 వరకూ.. మే 19, 2016 నుంచి ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా సేవలందించారు.