శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (07:02 IST)

అమ్మకు గుండెపోటు.. బెంగళూరులో అల్లర్లు జరిగే అవకాశం.. చెన్నైలోనూ హై అలెర్ట్..

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. ఆమెకు గుండెపోటు వచ్చిందని.. అపోలో వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో.. అమ్మ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్నవార్తల నేపథ్యంలో.. తమిళ రాష్ట్రంతో పాటు బెంగళూరు

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. ఆమెకు గుండెపోటు వచ్చిందని.. అపోలో వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో.. అమ్మ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్నవార్తల నేపథ్యంలో.. తమిళ రాష్ట్రంతో పాటు బెంగళూరులో అల్లర్లు జరిగే అవకాశం ఉందని అనుమానాలు రావడంతో బెంగళూరు నగరంలో తమిళ సోదరులు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లోకట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని బెంగళూరు నగర పోలీసు కమీషనర్ మేఘరిక్ ఆదేశాలు జారీ చేశారు.
 
బెంగళూరు నగరంలో దాదాపు 20 లక్షల మంది తమిళ సోదరులు నివాసం ఉంటున్నారు. వారిలో అన్నాడీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు కొన్ని వేల మంది ఉన్నారు. జయలలిత ఆరోగ్యం విషమించిందని ఆదివారం రాత్రి విషయం తెలియడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందారు. 
 
ఇప్పటికే ప్రత్యేక పూజలు, హోమాలు మొదలు పెట్టారు. బెంగళూరులో సోమవారం జయలలిత కటౌంట్లు, ఫ్లక్సీలు ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత చర్యగా నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
 
మరోవైపు అన్నాడీఎంకే అధినేత్రి జయ ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. అమ్మకు ఏం జరిగిందోనని ఆందోళన చెందుతారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలనుంచి పెద్ద సంఖ్యలో అన్నాడిఎంకే శ్రేణులు అపోలో ఆసుపత్రి వైపు తరలి వస్తుండటంతో ఆ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 
 
రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు చెన్నైకి దారితీసే అన్నిమార్గాలలోనూ భారీగా చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి అన్నాడిఎంకే శ్రేణులను అడ్డుకుంటున్నారు. అన్నాడిఎంకే కార్యకర్తలంతా చెన్నై రోడ్ల మీదకు చేరడంతో రాత్రి పట్టపగలుగా మారింది. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోమవారం స్కూళ్లు, విద్యా సంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో సోమవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.