శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (11:52 IST)

రహస్య ఓటింగ్ జరపాలి... పన్నీర్, స్టాలిన్ వినతి... తిరస్కరించిన స్పీకర్

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకునే నిమిత్తం ఏర్పాటు చేసిన అసెంబ్లీలో రహస్య ఓటింగ్ నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి ఓ ప

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకునే నిమిత్తం ఏర్పాటు చేసిన అసెంబ్లీలో రహస్య ఓటింగ్ నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, విపక్ష నేత ఎంకేస్టాలిన్ డిమాండ్ చేశారు. అయితే, సభాపతి వి.ధనపాల్ వారి వినతిని నిరాకరించారు. 
 
పైగా, మూజువాణి ఓటుతో బలనిరూపణ చేసుకోవాలని సీఎం పళనిస్వామికి స్పీకర్ అవకాశమిచ్చారు. రహస్య ఓటింగ్ నిర్వహించాలని డీఎంకే, పన్నీర్ వర్గం పట్టుబట్టింది. అయితే రహస్య ఓటింగ్‌ను స్పీకర్ తిరస్కరించారు. దీంతో డీఎంకే, పన్నీర్ స్వామి వర్గం ఎమ్మెల్యేల నినాదాలతో హోరెత్తించారు. పోటాపోటీ నినాదాలతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.
 
అసెంబ్లీలో ప్రస్తుతం 230 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. డీఎంకే అధినేత కరుణానిధి, కోయంబత్తూరు నార్త్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే అరుణ్ కుమార్ సభకు హాజరుకాలేదు. దీంతో పళనిస్వామి సర్కారు మెజార్టీ సాధించాలంటే 116 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి అయింది.