శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 మార్చి 2017 (09:18 IST)

ఆర్కే.నగర్ బైపోల్ : నటి గౌతమికి షాకిచ్చిన బీజేపీ... ఇళయరాజా బ్రదర్‌కు టిక్కెట్

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చేనెల 12వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శ

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చేనెల 12వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పోటీ చేస్తుండగా, ఆ పార్టీ తిరుగుబాటు వర్గం నుంచి సీనియర్ నేత ఇ. మధుసూదనన్ బరిలోకి నిలిచారు. అలాగే, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కూడా స్థానికంగా మంచి పట్టున్న అభ్యర్థిని బరిలోకి దించింది. 
 
ఈ నేపథ్యంలో బీజేపీ తన అభ్యర్థిని శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఈ ఎన్నికల్లో సినీ నటి గౌతమి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆమె రెండుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. అలాగే, వివిధ అంశాలపై ఆమె నేరుగా మోడీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆమెకు బీజేపీ సీటు కేటాయిస్తుందనే ప్రచారం జరిగింది. 
 
అయితే, సామాజికవర్గాల సమీకరణ నేపథ్యంలో సీనియర్ సంగీత దర్శకుడు గంగై అమరన్‌ (ఇళయరాజా సోదరుడు)ను బరిలో నిలిపింది. ఇక గెలుపు కోసం తెరవెనుక పాపులు కదుపుతోంది. ప్రధాన పార్టీల ఓట్లు చీలిపోతే తమ అభ్యర్థి గెలుపు తేలికవుతుందని లెక్కలు వేస్తోంది. ఉన్నట్లుండి గౌతమిని ఎందుకు పక్కనపెట్టారో అంతుచిక్కడం లేదు. 
 
నిజానికి ఇటీవల జయలలిత మృతిపై విచారణ జరిపించాలని ఆమె బహిరంగంగా డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ విషయమై ప్రధాని మోడీకి లేఖ రాయడం, ఆయనను కలవడం కూడా జరిగిపోయింది. గతంలో బీజేపీ తరపున ప్రచారం చేసిన అనుభవం గౌతమికి వుంది. 2014 ఎన్నికలకు ముందు గంగై అమరన్‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ కల్చరల్ సెల్‌కి అధ్యక్షుడిగా ఉన్నారు.