శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (19:11 IST)

కరోనా వైరస్ తీవ్రత.. 24 గంటల్లో కొత్తగా 5,871 కేసులు.. ఏపీలో కోవిడ్ విజృంభణ

తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతుంది. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,835 పాజిటివ్ కేసులు, 119 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,355కు, మరణాల సంఖ్య 5,397కు చేరింది. 
 
కాగా, గత 24 గంటల్లో 5,146 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానాల నుంచి డిశ్చార్జ్ అయినట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 2,61,459 మంది కోలుకోగా ప్రస్తుతం 53,499 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,996 కొత్త కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,64,142కు చేరుకుంది. మహమ్మారి బారినపడి 82 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల సంఖ్య 2,378కి చేరింది. 
 
గడిచిన 24 గంటల్లో ఏపీలో 55,692 కొవిడ్ టెస్టులు నిర్వహించారు. కొవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య 27 లక్షలు దాటింది. కరోనాబారినపడి కోలుకొని డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 1,70,924గా ఉంది. ప్రస్తుతం 90,840 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.