Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీడీపీ ఎంపీలు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు.. స్పీకర్ వార్నింగ్

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (12:42 IST)

Widgets Magazine
sumitra mahajan

తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానిస్తూ, వారిని సున్నితంగా హెచ్చరించారు. అంతేకాకుండా, చెప్పినమాట వినకుంటే, మీ పిల్లల్ని కూడా అదుపులో పెట్టుకోలేరంటూ మందలించారు. 
 
విభజన హామీలను అమలు చేయాలంటూ గత రెండు రోజులుగా టీడీపీ సభ్యులు పార్లమెంటు బయట, లోపల ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఉండగా బుధవారం కూడా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించడంతో స్పీకర్ సుమిత్రా మహజన్ కోపగించుకున్నారు.
 
తెలుగుదేశం పార్టీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారని చురకలు వేశారు. అంతేగాక ఇలా అయితే ఇంట్లో పిల్లల్ని కూడా క్రమశిక్షణలో పెట్టుకోలేరంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆంధ్రా ఎంపీని అవమానించిన కాంగ్రెస్.. సభలో దొరకని మద్దతు

కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసం చేసింది. రాజ్యసభ వేదికగా పోరాటం చేస్తున్న ఆ పార్టీకి చెందిన ...

news

భార్యను తమ్ముడికిచ్చి పెళ్లి చేయండి.. తొలిరాత్రి రోజున ఉరేసుకుని?

పెళ్లి చేసుకుని 24గంటలు కూడా కాలేదు. ఇంతలో పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ...

news

భార్యను గొడ్డలితో నరికి... సూసైడ్ చేసుకున్న బీఎస్ఎఫ్ జవాను

భారత సరిహద్దులను రక్షించే ఓ జవాను కిరాతక చర్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంలో తన భార్యను ...

news

"గాలి" మృతి చిత్తూరు జిల్లాకు తీరని లోటు : వైకాపా ఎమ్మెల్యే రోజా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం చిత్తారు ...

Widgets Magazine