Widgets Magazine

దెయ్యాలను వదిలిన బూత్ బంగళా ఇచ్చారు : లాలూ తనయుడు

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (08:51 IST)

tej pratap

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుడు, బీహర్ రాష్ట్ర మాజీ మంత్రి తేజ్‌ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బూతు బంగళా కేటాయించి, అందులో దెయ్యాలను వదిలిపెట్టారనీ, అందుకే ఆ బంగళాను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. 
 
తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా ఉన్నప్పుడు దేశ్‌రత్న్‌ మార్గ్‌లోని భవనాన్ని కేటాయించారు. ఆది నుంచి వాస్తు, మతపరమైన విషయాలపై గట్టి నమ్మకం ఉన్న తేజ్‌ ఆ బంగ్లాను తన సెంటిమెంట్‌గా భావించారు. అప్పట్లో ఈ బంగ్లా ప్రధాన ద్వారం మూసేసి, పలు మార్పులు కూడా చేయించారు. 
 
కానీ మంత్రి పదవి నుంచి దిగిపోయాక ఆ భవనాన్ని ఖాళీ చేయాలని తేజ్‌ప్రతా్‌పకు నితీశ్‌ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అయినా బంగ్లాను ఖాళీ చేయని తేజ్‌.. పాట్నా హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నోటీసులపై స్టే విధించింది. 
 
ఈ నేపథ్యంలో, ఆకస్మికంగా ఆయన ఆ బంగళాను ఖాళీ చేశారు. 'సీఎం నితీశ్‌కుమార్‌, ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ నా ఇంట్లో దెయ్యాలను వదిలారు. అవి నన్ను వేధిస్తున్నాయి. అందుకే బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది' అంటూ ఆయన ట్వీట్ చేశారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఢిల్లీలో 'చెన్నై' దీపక్... యువతి దుస్తులు మార్చుకుంటుండగా వీడియో షూట్...

ఢిల్లీలో జార్ఖండ్ కు చెందిన ఓ విద్యార్థినికి దారుణమైన అనుభవం ఎదురైంది. ఆమె స్నానాల గదిలో ...

news

వృద్ధాశ్రమంలో శవాల దందా.. వృద్ధుల శవాలను శ్మశానాలకు తరలించకుండా.. ఎముకలతో?

వృద్ధాశ్రమంలో శవాల దందా తమిళనాడులో వేలూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తోడునీడా లేకుండా ...

news

ప్రత్యేక హోదాపై జనసేన టీషర్టులు.. మహాటీవీ దాడిని ఖండించిన పవన్

ప్రత్యేక హోదాపై జనసేన ప్రచారం మొదలెట్టింది. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలనే ...

news

ఆమె చేసిన సాహసం భారతదేశాన్ని అగ్రదేశాల సరసకు చేర్చింది... ఏంటది? ఎవరు?(వీడియో)

భారతదేశంలో అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారనేందుకు మరో ఉదాహరణ. అంతేకాదు... ఆమె చేసిన ...

Widgets Magazine