శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 మే 2017 (17:38 IST)

తాజ్‌మహల్ వద్ద పాము... టూరిస్టులు పరుగో పరుగు.. నీళ్లు తాగడానికి వచ్చిందట...

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద పాము కలకలం సృష్టించింది. దాదాపు ఆరు అడుగులు పొడవున్న పామును చూసిన పర్యాటకులు బెంబేలెత్తిపోయారు. కొంతమంది అక్కడి నుంచి పరుగులు పెట్టగా.. మరికొందరు సాయం కోసం పెద్దగా

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద పాము కలకలం సృష్టించింది. దాదాపు ఆరు అడుగులు పొడవున్న పామును చూసిన పర్యాటకులు బెంబేలెత్తిపోయారు. కొంతమంది అక్కడి నుంచి పరుగులు పెట్టగా.. మరికొందరు సాయం కోసం పెద్దగా కేకలేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులను సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది ఇచ్చిన సమాచారంతో తాజ్‌మహల్ వద్దకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది గంటపాటు శ్రమించి పామును పట్టుకున్నారు.  
 
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. వేసవిలో దాహార్తితో తల్లడిల్లిన పాము చల్లదనం కోసం కట్టడం వైపు వచ్చిందన్నారు. పబ్లిక్ వాటర్ సదుపాయం కోసం నాలుగు ఆర్వో ప్లాంట్లను తాజ్‌మహల్‌ వద్ద నిర్వహిస్తున్నారు. నీరు తాగడానికి వెళ్లిన ఓ వ్యక్తి పామును గమనించడంతో కలకలం చెలరేగిందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ పాము ఆరడుగులు ఉన్నదని వారు చెప్పారు.