శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (18:40 IST)

కాశ్మీర్‌లో హింసకు పాల్పడేవారు 5 శాతం మందే.. పాలు, చాక్లెట్ కొనుక్కుని?: మెహబూబా

కాశ్మీర్‌లో 95 శాతం మంది కాశ్మీరులు శాంతిని కోరుకుంటుంటే.. కేవలం ఐదు శాతం మంది మాత్రమే హింసకు పాల్పడుతున్నారని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. కాశ్మీర్ అల్లర్లపై ఆమె ఫైర్ అయ్యారు. కా

కాశ్మీర్‌లో 95 శాతం మంది కాశ్మీరులు శాంతిని కోరుకుంటుంటే.. కేవలం ఐదు శాతం మంది మాత్రమే హింసకు పాల్పడుతున్నారని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. కాశ్మీర్ అల్లర్లపై ఆమె ఫైర్ అయ్యారు. కాశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో కలిసి గురువారం మెహబూబా మీడియాతో మాట్లాడుతూ.. 2010 నాటి షోపియాన్ అల్లర్లతో ప్రస్తుత అల్లర్లను పోల్చడం సరికాదన్నారు. అప్పటి అల్లర్లకు కారణం ఉందన్నారు. 
 
షోపియాన్‌కు చెందిన ఇద్దరు మహిళలపై సెక్యూరిటీ సిబ్బంది అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి మధ్య ఎంతో తేడా ఉందని చెప్పుకొచ్చారు. జూలై నుంచి జరుగుతున్న అల్లర్లలో పాలుపంచుకుంటున్న వారు ఐదు శాతం మంది మాత్రమేనని, వారంతా జాతి వ్యతిరేకులని పేర్కొన్నారు. వారి ఆందోళన చట్టబద్ధం కాదన్నారు.
 
జమ్మూ కాశ్మీర్‌లో నిరసనలకు దిగుతూ, భద్రతాదళాల కాల్పుల్లో మరణించిన వారిపై ముఫ్తీ మండిపడ్డారు. వారేమీ పాలు లేదా చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి తిరిగి వెళ్లేందుకు రాలేదన్నారు. ఆరేళ్ల క్రితం ఫేక్ ఎన్‌కౌంటర్ జరిగిందని ఆ కారణంగా అల్లర్లు చెలరేగాయన్నారు. ఇప్పుడు మాత్రం నిరసనలను దగ్గరుండి ప్రోత్సహించే వర్గాలు తయారయ్యాయన్నారు. ఆనాడు ప్రాణాలు కోల్పోయిన వారిని, నేడు మరణించిన వారికి పోలికలు లేవని చెప్పారు.