శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (17:22 IST)

యూపీలో కునుకుతీశారు.. బీహార్‌లో క్యాండీక్రష్ ఆడారు.. పోలీసులపై యాక్షన్..

మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంపై బీహార్ పోలీసులు ఏప్రిల్ 28న ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం ప్రసంగి

మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంపై బీహార్ పోలీసులు ఏప్రిల్ 28న ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం ప్రసంగిస్తున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా క్యాండీక్రష్ ఆడిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ముగ్గురు పోలీసులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. ఘటనపై రాష్ట్ర అదనపు డీజీపీ ఎస్‌కే సింఘాల్‌ మాట్లాడుతూ.. సీనియర్‌ పోలీసులు ఇలా ప్రవర్తిస్తారని ఊహించలేదని.. వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు.
 
మాదక ద్రవ్యాల సమస్యపై సీఎం మాట్లాడుతుంటే ఏమీ పట్టనట్లు స్మార్ట్ ఫోన్‌లో పోలీసులు క్యాండీక్రష్ ఆడుకుంటూ ఉన్న ఫోటోలు గతవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల ఆధారంగా పోలీసు యంత్రాంగం వారిని గుర్తించింది. 
 
సీఎం, డీజీపీ ఉన్నా కూడా పోలీసులు ఫోన్‌లో క్యాండీక్రష్ ఆడిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే తరహాలో ఇటీవల యూపీలోని గ్రేటర్ నోయిడాలోనూ పోలీసులు కారులో హాయిగా నిద్రపోయారు. అత్యాచార కేసును విచారించేందుకు వెళ్లిన ఓ పోలీసు దర్యాప్తు సమయంలో వ్యాన్‌లో కునుకుతీస్తూ కన్పించాడు. దీంతో అతడిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.