నవ దంపతులను కొట్టి.. వధువుపై గ్యాంగ్ రేప్

rape girl
Last Updated: గురువారం, 11 అక్టోబరు 2018 (12:09 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లాలో దారుణం జరిగింది. నవ దంపతులపై నలుగురు వ్యక్తులు దాడి చేసి.. వధువుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
తిరువళ్ళూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవలే వివాహమైంది. తన భార్యతో కలిసి కుమరన్ నాయికన్ పేటలోని దేవాలయానికి దైవదర్శనానికి వచ్చాడు. దైవ దర్శనం అనతరం నవదంపతులు ఇద్దరూ బైక్‌పై తిరిగి ఇంటికి వెళ్తుండగా.. నలుగురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ నలుగురు నవ దంపతులపై దాడి చేశారు. వరుడి చేతిపై కత్తితో దాడి చేశారు. 
 
దీంతో భయపడిన వరుడు.. భార్యను అక్కడే వదిలి గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామంలోకి వెళ్లి ఎవరినైనా సహాయం తీసుకువద్దామనుకొని అతను పరుగులు తీయగా.. అదే అదునుగా భావించిన దుండగులు వధువుపై అత్యాచారానికి తెగబడ్డారు. గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ దారుణం జరిగింది. 
 
వరుడి సమాచారంతో గ్రామస్థులు అక్కడికి చేరుకోగా.. ఆలోపే నలుగురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గాలించి పట్టుకున్నారు. నిందితులు మునుస్వామి(36), మోహన్(29), మరో ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. నలుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనిపై మరింత చదవండి :