Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒంటి నొప్పులతో అలా నడుం వాల్చితే.. భర్త తలాక్ చెప్పేశాడు..

గురువారం, 28 డిశెంబరు 2017 (18:48 IST)

Widgets Magazine
muslim women divorce

ఒంటి నొప్పులతో కొద్దిసేపు అలా నడుం వాల్చిన పాపానికి ఓ భర్త తలాక్ చెప్పి ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం బిల్లును ఆమోదించినా.. తలాక్ చెప్పి భార్యను దూరం చేసుకునే భర్తలు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్, రాంపూర్‌లో మద్యం తాగి భర్త చేజేసుకోవడంతో.. ఒంటి నొప్పులతో ఉదయం ఎక్కువగా నిద్రపోయిన భార్యకు భర్త తలాక్ చెప్పాడు. 
 
వివరాల్లోకి వెళితే.. రాంపూర్‌లోని అజీంనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ బుధవారం ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేవడంతో భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటి నుంచి గెంటేసి.. తలాక్ చెప్పానని ఇక ఇంటి గడప తొక్కవద్దన్నాడు. 
 
ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భర్త రాత్రి మద్యం తాగి కొట్టడంతోనే... ఒంటి నొప్పులతో బాధపడుతూ గంట సేపు ఎక్కువగా నిద్రపోయానని బాధితురాలు వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఇదిలా ఉంటే.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన త‌రువాత సైతం 100 ట్రిపుల్ తలాక్ కేసులు బయటపడ్డాయని కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ లోక్‌స‌భ‌లో వెల్లడించారు. గురువారం ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగాఆయ‌న మాట్లాడుతూ... ట్రిపుల్ త‌లాక్ అంశంపై పార్ల‌మెంటు చూస్తూ ఊరుకోవాలా? అని ప్ర‌శ్నించారు. ఓటు బ్యాంకు రూపంలో ఈ బిల్లును చూడ‌వ‌ద్దని కేంద్ర మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఇది ముస్లిం మ‌హిళ‌ల గౌర‌వానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్‌ను పాకిస్థాన్‌లోనూ నిషేధించారని గుర్తు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భర్త వున్నప్పుడే బొట్టు, మంగళసూత్రం తీసేస్తారా?: సుష్మా కన్నీరు (వీడియో)

భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను చూసేందుకు పాకిస్థాన్‌కు వెళ్లిన సంగతి ...

news

ప్రేమకు అడ్డు చెప్పిందని.. పెంపుడు తల్లిని చంపేసిన బాలిక

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో దారుణం జరిగింది. అనాథ ఆశ్రమం నుంచి మూడు నెలల వయస్సున్నప్పుడు ...

news

ఇంటికొచ్చి లైంగికంగా వేధించిన బావ- విషమిచ్చి చంపేసిన మరదలు

లైంగిక వేధింపులు తాళలేక బావనే ఓ మరదలు హత్య చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ...

news

లాలూకు రాజ మర్యాద: పప్పు, స్వీట్స్, బాస్మతి బియ్యం అన్నం, కాఫీలిచ్చి?

పశువులకు దాణా కొనుగోలు చేస్తున్నట్లుగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కుంభకోణంలో ...

Widgets Magazine