Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మొన్న ముంబై నిన్న హైదరాబాద్ ఇపుడు చెన్నై.. ఈ వారంలోనే రెండు తుఫాన్లు!

గురువారం, 5 అక్టోబరు 2017 (13:01 IST)

Widgets Magazine

ఈ యేడాది వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. మొన్నటికిమొన్న ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అస్తవ్యస్తం చేశారు. అలాగే, నిన్నటికి నిన్న హైదరాబాద్ నగరాన్ని ముంచేసింది. ఇక చెన్నై నగరం వంతు రానుంది. వరుసగా రెండు తుఫాను చెన్నై నగరాన్ని తాకనున్నాయట. 
 
సాధారణంగా నవంబర్ - డిసెంబర్‌ నెలలు వచ్చాయంటేనే నగర ప్రజలు ఉలిక్కిపడతారు. ఇక వరుసగా రెండు తుఫాన్లు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉంటుందోనంటూ అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. వారం రోజుల వ్యవధిలో రెండు తుపాన్లు విరుచుకుపడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ఈ రెండు తుఫాన్ల ప్రభావంతో నగరం సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఈ నెల 7న ఓ వాయుగుండం తుఫానుగా మారి 11న చెన్నై తీరాన్ని తాకుతుందని తెలిపింది. 
 
ఆ తర్వాత 12న మరో వాయుగుండం తుఫానుగా మారి 15 నుంచి 20వ తేదీలోపున చెన్నై తీరాన్ని దాటుతుందని తెలిపారు. ఈ నెల 11లోపున తీరం దాటే తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండి భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెపుతున్నారు. 
 
ఈ రెండు తుపాన్లు కడలూరు - నెల్లూరు మధ్య తీరం దాటడం ఖాయమని అంటున్నారు. ఈ రెండు తుఫానుల వల్ల ఈశాన్య రుతుపవనాలు తోడై మామాలు స్థాయికన్నా 111 శాతం అధికంగా వర్షాలు కురుస్తాయని వారు అంచనా వేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నిజం మాట్లాడితే "యాంటీ మోడీ" అనేస్తారా? ప్రకాశ్ రాజ్ ప్రశ్న.. కేసు నమోదు

బెంగుళూరులో దారుణ హత్యకు గురైన మహిళా సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యపై ప్రధానమంత్రి ...

news

ఆర్థిక కష్టాల్లో ఉత్తర కొరియా... అన్నం కోసం ఆయుధాల విక్రయం

నిన్నమొన్నటివరకు ప్రపంచ దేశాలను ధిక్కరించిన ఉత్తర కొరియా ఇపుడు ఆర్థిక కష్టాల్లో ...

news

మానవత్వమా నీవెక్కడ అంటూ ప్రశ్నస్తున్న స్పీకర్ కోడెల

ఇటీవలికాలంలో సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలు ఘోరాలపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవేదన ...

news

అమరావతి అభివృద్ధిపై మాస్టర్‌ ప్లాన్స్‌.. శరవేగంగా పనులు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో ఏపీ ప్రభుత్వం వేగాన్ని పెంచింది. అమరావతికి ...

Widgets Magazine