శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (15:12 IST)

దేశవ్యాప్తంగా 24 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం: అరుణ్ జైట్లీ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18వ బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా 24 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18వ బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా 24 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా ప్రవేశపెట్టిన ఈ సంపూర్ణ బడ్జెట్‌లో అరుణ్ జైట్లీ.. ఉచిత వైద్య సేవల పథకం కోసం ఆరోగ్య శాఖకు రూ.1,200 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. 
 
ఈ పథకం కింద 50 కోట్ల మంది లబ్ధి పొందారని అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. అంతేగాకుండా జాతీయ ఆరోగ్య భద్రతా పథకం ద్వారా పది కోట్ల పేద కుటుంబాలకు ఉచిత వైద్య బీమాను అందిస్తామని, టీబీ రోగులకు వైద్యం అందించేందుకు రూ. 600కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 
 
ఆయుష్మాన్ పథకం కింద పలు లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి. దేశ వ్యాప్తంగా 24 జిల్లా ఆస్పత్రులను అభివృద్ధి చేసే దిశగా మెడికల్ కాలేజీలను, ఆస్పత్రుల కోసం ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.