Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమకు అడ్డు చెప్పిందని.. పెంపుడు తల్లిని చంపేసిన బాలిక

గురువారం, 28 డిశెంబరు 2017 (15:05 IST)

Widgets Magazine

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో దారుణం జరిగింది. అనాథ ఆశ్రమం నుంచి మూడు నెలల వయస్సున్నప్పుడు దత్తత తీసుకున్న కుమార్తే.. పెంపుడు తల్లిని పొట్టనబెట్టుకుంది. ఇందుకు కారణం ప్రేమ వ్యవహారమేనని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మూడు నెలల నుంచి ఆశ్రమం నుంచి తెచ్చుకుని పెంచుకున్న బాలికకు 12 ఏళ్లు వచ్చాయి. తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న పెంపుడు తల్లిని ఆ బాలికే హతమార్చింది. 
 
12 ఏళ్ల వయసులోనే ఆ బాలిక ప్రేమలో పడిందని.. ఈ వయస్సులో ప్రేమ వద్దని హెచ్చరించిన పాపానికి ఆమెను చంపేసిందని పోలీసులు వెల్లడించారు. ప్రేమకు అడ్డుగా చెప్పిందని.. త‌ల్లిపై ఆగ్ర‌హం తెచ్చుకున్న ఆ బాలిక తన స్నేహితుడిని రాత్రి స‌మ‌యంలో ఇంటికి పిలిపించి, అతడితో కలిసి గొంతు నులిమి హతమార్చింది. అనంత‌రం త‌న‌ తల్లికి ఆరోగ్యం బాగోలేదని, స్పృహ త‌ప్పి ప‌డిపోయింద‌ని అంద‌రినీ న‌మ్మించింది.
 
వైద్యులు కూడా ఆమె మరణించిందని నిర్ధారించారు. కానీ అంత్యక్రియలు జరిపే స‌మ‌యంలో మృత‌దేహం గొంతుపై గాయాలు ఉండటంతో స్థానికుల‌కు అనుమానం క‌లిగింది. దీంతో పోలీసులు ఆ బాలిక‌ను విచారించ‌గా అస‌లు విష‌యాన్ని తెలిపింది. ఈ కేసులో మహిళను హతమార్చిన బాలిక, బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇంటికొచ్చి లైంగికంగా వేధించిన బావ- విషమిచ్చి చంపేసిన మరదలు

లైంగిక వేధింపులు తాళలేక బావనే ఓ మరదలు హత్య చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ...

news

లాలూకు రాజ మర్యాద: పప్పు, స్వీట్స్, బాస్మతి బియ్యం అన్నం, కాఫీలిచ్చి?

పశువులకు దాణా కొనుగోలు చేస్తున్నట్లుగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కుంభకోణంలో ...

news

మోడల్‌పై ఢిల్లీలో గ్యాంగ్ రేప్: సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని.. అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి?

మహిళలపై అఘాయిత్యాలకు అడ్డాగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కామాంధులు ...

news

కరివేపాకులా మారిపోయాం- ఎంపీలుగా చేసిందేమీ లేదు: జేసీ దివాకర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ...

Widgets Magazine