Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పులికి ఆహారమైపో! వృద్ధులను అడవుల్లోకి పంపుతున్న కొడుకులు.. ఎక్కడ?

గురువారం, 6 జులై 2017 (12:11 IST)

Widgets Magazine
tiger

కాటికి కాళ్లు చాపిన వయసులో తమ కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన వృద్ధులను కొందరు కొడుకులు పులులకు ఆహారంగా పంపుతున్న విషాదకర సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో జరిగింది. పైగా వృద్ధాప్యంలో బతికుండి మాకేం లాభంలేదు.. అడవిలోకి వెళ్లి పులికి ఆహారమైపో... మాకు డబ్బులొస్తాయి అంటూ చీటిపోటిమాటలతో వేధిస్తున్నారు. ఈ మాటలను భరించలేని కొందరు వృద్ధులు అడవుల్లోకి వెళ్లి పులులు, సింహాలకు ఆహరమై శాశ్వతంగా దూరమైపోతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఫిలిబిత్‌ పులుల అభయారణ్యం (పీటీఆర్‌) ఉంది. ఈ అరణ్యం చుట్టూత అనేక గ్రామాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రజలెవరూ అడవుల్లోకి వెళ్లకూడదు. అలా వెళ్లి పులుల చేతిలో చనిపోయినా... ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదు. అదే పులులే జనావాసాల్లోకి వచ్చి, ఎవరినైనా చంపితే ఆ కుటుంబాలకు లక్షల్లో పరిహారం ఇస్తారు. ఈ యేడాది ఫిబ్రవరి 16 నుంచి ఇప్పటిదాకా ఒక్క మాలా రేంజ్‌లోనే ఏడుగురు వృద్ధులకు సంబంధించి ప్రభుత్వం పరిహారం చెల్లించింది. 
 
దీనిపై అటవీ శాఖ అధికారులకు సందేహం వచ్చింది. కేంద్రానికి చెందిన వన్యప్రాణి సంబంధిత నేరాల నియంత్రణ బోర్డు కూడా ఫిర్యాదు చేయగా, వారు రంగంలోకి దిగారు. బోర్డుకు చెందిన సీనియర్ అధికారి కలీమ్‌ అథర్‌ ఈ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. పులి దాడి ఎక్కడ జరిగింది, మృతదేహం లభించినచోటు, స్థానికుల అభిప్రాయాలు... ఇలా అన్నీ పరిశీలించి కేంద్రానికి ఒక నివేదిక రూపొందించి మరణాల తీరు అనుమానాస్పదంగా ఉందని తేల్చారు. 
 
దీనిపై మరింత లోతుగా ఆరా తీయగా, కొన్ని నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధులు తమంతట తామే అడవుల్లోకి వెళ్లి పులులకు ఆహారమవుతున్నారని తేలింది. ఆ తర్వాత... శరీర అవశేషాలను దాడి జనావాసాల్లోకి తెచ్చి వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం పొందుతున్నట్టు తేలింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మమతా బెనర్జీ పార్టీలో చీలిక.. ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై?

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రపతి ...

news

ప్రేమించాడు... కోర్కె తీర్చుకున్నాడు.. పెళ్లి చేసుకోమంటే ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్

ప్రేమ పేరుతో ఓ బాలికను తన వలలో వేసుకున్న ఓ కామాంధుడు... తన కోర్కెను తీర్చుకున్నాడు. ఆ ...

news

శోభనం తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోలేదని సూసైడ్ నాటకం... జీడిమామిడి తోటలో నిప్పంటించాడు

ఓ కామాంధుడి ఆడిన నాటకానికి ఓ యువతి మోసపోయింది. ప్రేమ, పెళ్లి, శోభనం తర్వాత మనం ...

news

ఏమండీ.. మీ నాన్న అత్యాచారం చేశాడు.. భార్య :: నీకు మామే కదా... సర్దుకుపోవే.. భర్త

సభ్యసమాజం తలదించుకునే చర్య. మానవ సంబంధాలకు మాయని మచ్చ. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన కోడలిపై ...

Widgets Magazine