Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిజాయితీగా విధులు నిర్వహించింది.. వారం తిరక్కుండానే బదిలీ.. ఎక్కడ?

ఆదివారం, 2 జులై 2017 (14:46 IST)

Widgets Magazine
shresta thakur

నిజాయితీగా, ధైర్యంగా విధులు నిర్వహించిన ఓ మహిళా పోలీసు అధికారిణికి సరిగ్గా వారం రోజులు తిరక్కుండానే బదిలీ ఉత్తర్వులు చేతికి వచ్చాయి. అదీ కూడా స్వచ్ఛమైన, నీతివంతమైన, పారదర్శక పాలన అందిస్తానంటూ ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పాలనలో. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
యూపీలో అధికారం తమదేనన్న ధైర్యంతో నిబంధనలను ఉల్లింఘించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేత ప్రమోద్ కుమార్‌కు మహిళా పోలీసు ఐపీఎస్ అధికారిణి శ్రేష్ట ఠాగూర్ ఇటీవల ముచ్చెమటలు పట్టించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాన్ని నడుపుతున్న ఆయనను అడ్డుకుని జరిమానా విధించారు. 
 
ఈ సందర్భంగా ఆయనకు, బీజేపీకి క్యాడర్, శ్రేష్ఠ ఠాగూర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు తనిఖీలు చేసే అధికారం లేదని లెటర్ రాయించుకుని వస్తే తనిఖీలు వదిలేస్తామని శ్రేష్ట ఠాకూర్ తెగేసి చెప్పారు. రాత్రింబవళ్లు కుటుంబాలను వదిలి కేవలం సరదాల కోసం ఉద్యోగం చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దురుసుగా వ్యవహరించిన ఐదుగురిని జైలుకు కూడా పంపారు. 
 
శ్రేష్ట ఠాకూర్‌ నిజాయితీపై మీడియాలో ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి. అయితే, ఠాకూర్‌ చర్యను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్థానిక బీజేపీ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ నేరుగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వారం కూడా తిరక్కుండానే శ్రేష్ట ఠాకూర్‌పై అధికారులు బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం ఆమెను బహ్‌రైచ్‌కు బదిలీ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బ్లూ ఫిల్మ్ అంటే ఏంటో తెలుసా? ఎపుడైన చూశారా? ప్రజలను ప్రశ్నించి సీఎం..

ఇటీవలి కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిత్యం వివాదాల్లో చిక్కుకుని ...

news

చివరకు పంచె మాత్రమే మిగులుతుంది : వెంకయ్య నాయుడు చురకలు

"ఆస్తిని, సంప‌ద‌ను పెంచ‌కుండా పంచితే చివ‌రికి నీకు మిగిలేది పంచె మాత్ర‌మే"న‌ని కేంద్ర ...

news

వరుసకు బావా మరదళ్లు.. పెళ్ళికి ఒప్పుకోలేదని ఏం చేశారో తెలుసా?

వారిద్దరూ వరుసకు బావామరదళ్లు. కానీ, పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇక జీవించడం వృధా అనుకున్న ...

news

గో సంరక్షణ పేరుతో హత్య.. బీజేపీ నేత అరెస్టు

గో సంరక్షణ పేరుతో హత్యలు ఏమిటని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించిన రోజే పశుమాంసం ...

Widgets Magazine