మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 3 మార్చి 2019 (12:23 IST)

నోరు జారిన ఎమ్మెల్యే శ్యామ్ బిహారీ లాల్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే శ్యామ్ బిహారీ లాల్ నోరు జారీచేశారు. మీకోసం వేశ్యలను తెచ్చి, వారితో డ్యాన్సులు చేయించాలా? అని ఆయన మండిపడ్డారు. 
 
ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు తన నియోజకవర్గంలోని ఓ గ్రామానికి వచ్చిన ఆయనతో, ఓ యువకుడు, తమ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించాడు. 
 
దీంతో శ్యామ్ బిహారీ లాల్ కు ఆగ్రహం తన్నకుచ్చొంది. 'నోటికొచ్చినట్లు మాట్లాడకు. మీ గ్రామం అభివృద్ధి చెందలేదా? కరెంట్ రాలేదా? రోడ్లు రాలేదా? ఇంకేం కావాలి? వేశ్యలను పిలిపించి, మీతో పాటు నృత్యాలు చేయించాలా?' అన్నారు.