శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 జులై 2017 (14:24 IST)

రేపిస్టుతో పెళ్లా... చావనైనా చస్తాగానీ.. వాడిని పెళ్లిచేసుకోనన్న ధీశాలి!

ఒక యువతిపై అత్యాచారం జరిపిన కేసులో నిందితుడిగా ఉన్న కామాంధుడిని పెళ్లి చేసుకునేందుకు ఓ యువతి నిరాకరించింది. చావనైనా చస్తాగానీ, రేపిస్టును పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. ఆమెకు తల్లిదం

ఒక యువతిపై అత్యాచారం జరిపిన కేసులో నిందితుడిగా ఉన్న కామాంధుడిని పెళ్లి చేసుకునేందుకు ఓ యువతి నిరాకరించింది. చావనైనా చస్తాగానీ, రేపిస్టును పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. ఆమెకు తల్లిదండ్రులు సైతం అండగా ఉండటంతో పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
భాను ప్రతాప్ (24) అనే బులానియా అనే గ్రామ యువకుడికి ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే, అప్పటికే అతనిపై దేవ్ రానియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై ఉంది. ఇది తప్పుడు కేసని, తనకే పాపం తెలియదని ప్రతాప్, పెళ్లి కూతురికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా, ఆమె వినలేదు. రేప్ చేసిన వాడితో పెళ్లేంటని, అమ్మాయిల పట్ల గౌరవం చూపని వాడు తనకు వద్దని చెప్పి పెళ్లిని రద్దు చేసింది. తన జీవితాన్ని అత్యాచార నిందితుడితో గడపలేనని ఆమె చెప్పగా, తల్లిదండ్రులు సైతం అంగీకరించారు.
 
పెళ్లి నిమిత్తం కట్న కానుకలుగా ఇచ్చిన బహుమతులు, డబ్బును వెనక్కు తిరిగి ఇచ్చేయాలని ఆ గ్రామ పంచాయితీ పెద్దలు తీర్పిచ్చారని తెలుస్తోంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లూ పూర్తయిన తర్వాత వరుడి తరపు బంధువుల్లోని ఒకరు ఈ విషయాన్ని వధువుకు చేరవేయగా, వెంటనే విషయాన్ని నలుగురికీ చెప్పి పెళ్లిని రద్దు చేసుకుంది.