శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2016 (14:34 IST)

ఉత్తరప్రదేశ్ : 23 యేళ్ళ యువకుడి ప్రాణం తీసిన నర్సు.. ఎందుకని?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ నర్సు ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ పని ఆమె కావాలని తీయలేదు. పొరపాటున చేసిన పని వల్ల ఆమె మృత్యువాతపడింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ నర్సు ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ పని ఆమె కావాలని తీయలేదు. పొరపాటున చేసిన పని వల్ల ఆమె మృత్యువాతపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఈటా జిల్లాలోని డాక్టర్ ముఖేష్ జైన్ ఓ చిన్న నర్సింగ్ హోమ్ నడుపుతున్నాడు. అతనికి తోడు ఓ నర్స్‌ను పెట్టుకుని వైద్యసేవలందిస్తున్నాడు. పెద్దాసుపత్రులకు వెళ్లే స్తోమత లేని వాళ్లు ఈ నర్సింగ్ హోంకు వస్తుంటారు. 
 
ఈ క్రమంలోనే అక్లఖ్ అనే 23 ఏళ్ల కుర్రాడిని తండ్రి అస్ఫఖ్ ఈ నర్సింగ్‌ హోమ్‌కు తీసుకొచ్చాడు. డాక్టర్ అతని పరిస్థితిని గమనించి చికిత్స చేశాడు. రోగిని చూసుకోమని కంపౌడర్‌కు చెప్పి ఇంటికెళ్లాడు. ఇంతలో రోజు వారీ విధులకు హాజరైన నర్సు ఒకరు ఇంజక్షన్ ఇచ్చింది. అప్పటికే అదే తరహా ఇంజెక్షన్‌ను డాక్టర్ వేశాడు. అదే ఇంజెక్షన్‌ను మరోమారు నర్సు వేయడంతో ఓవర్‌డోస్ అయింది. దీంత రోగి శ్వాస తీసుకోవడం కష్టమై ప్రాణాలు విడిచాడు.