శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2016 (12:50 IST)

ప్రేమించిన యువకుడ్ని పెళ్ళి చేసుకోవాలనుకున్న యువతిని నదిలో తోసేశారు!

పెద్దలను కాదని ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువతిని కుటుంబ సభ్యులు అతికిరాతకంగా నదిలో తోసేశారు. యూపీలోని ముజఫర్ నగర్ ప్రాంతంలోని నిర్గజ్ని గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలను పరిశీలిస్తే.. నిర్గజ్ని గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతి ఓ యువకుడిని చాలా రోజులుగా ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
ఈ యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి.. గంగా నదిలో కలిసే కాలువలోకి తోసేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ యువతిని కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు యువతి తండ్రి, సోదరుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.