Widgets Magazine

నాన్ వెజ్ తిన్నందుకు భార్య కేకలు... ఆత్మహత్య చేసుకున్న భర్త

నాన్ వెజ్ అతడి ప్రాణం పోవడానికి కారణమైంది. తన చిన్నారికి నాన్ వెజ్ తినిపించి తనూ తిన్న ఓ తండ్రి ఆ మాంసాహారం వల్ల తలెత్తిన వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వివరాల్లోకి వెళితే... లక్నోలోని గోమాతి నగర్‌లో డాక్టర్ ఉమా శంకర్ గుప్తా, దీప్తి అగర్

Non Veg
ivr| Last Modified శుక్రవారం, 12 జనవరి 2018 (22:08 IST)
నాన్ వెజ్ అతడి ప్రాణం పోవడానికి కారణమైంది. తన చిన్నారికి నాన్ వెజ్ తినిపించి తనూ తిన్న ఓ తండ్రి ఆ మాంసాహారం వల్ల తలెత్తిన వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వివరాల్లోకి వెళితే... లక్నోలోని గోమాతి నగర్‌లో డాక్టర్ ఉమా శంకర్ గుప్తా, దీప్తి అగర్వాల్ వుంటున్నారు. వీరికి ఆరేళ్ల కూతురు ఆరాధ్య వున్నది. డాక్టర్ గుప్తా స్కిన్ స్పెషలిస్ట్. భార్య దీప్తి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు.

గుప్తాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఐతే ఇందుకు భిన్నంగా అతడి భార్య దీప్తి పూర్తి శాఖాహారి. అందువల్ల వీరికి తరచూ మాంసాహారం విషయంలో గొడవలు తలెత్తుతుండేవి. ఈ క్రమంలో బుధవారం నాడు రాత్రి నాన్ వెజ్ తీసుకుని ఇంటికి వచ్చిన గుప్తా తన కుమార్తె ఆరాధ్యను నిద్రలేపి మాంసాహారాన్ని ఆమెకు కూడా తినిపించాడు. ఇది తెలుసుకున్న దీప్తి భర్త గుప్తాపై చెడామడా తిట్టి నానా హంగామా చేసింది. దీనితో మనస్తాపం చెందిన గుప్తా తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :