ఇస్రో కొత్త ప్రయోగం- విక్రమ్-ఎస్ రాకెట్ సక్సెస్.. స్పెసిఫికేషన్స్
ఇస్రో కొత్త ప్రయోగం చేసింది. ప్రైవేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించబోతోంది. దీని వల్ల రోదసీ వాణిజ్యంలో ఇస్రో మరో భారీ అడుగు వేసినట్లవుతుంది. హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్-ఎస్ రాకెట్‌ను రూపొందించింది. దీనిని శ్రీహరికోటలోని షార్ నుంచి శుక్రవారం ఉదయం 11:30 గంటలకు నింగిలోకి పంపింది.
ప్రైవేట్ రంగంలో ఇది మొదటి ప్రయోగం కాబట్టి దీన్ని ప్రారంభ్ మిషన్ అని పిలుస్తున్నారు. దీన్ని విజయవంతం చేయడం ద్వారా ఇస్రో.. చరిత్రలో మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించినట్లు అవుతుంది. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయికి నివాళిగా రాకెట్‌కు విక్రమ్-S అని పేరుపెట్టారు.
విక్రమ్-S స్పెసిఫికేషన్స్..
ఇది 545 కేజీల బరువును కలిగి వుంది.
రాకెట్ పొడవు 6 మీటర్లు.
ఇది నింగిలో 81.5 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయాణిస్తుంది.
ఈ రాకెట్ ద్వారా 3 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతారు.