శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2017 (09:15 IST)

మదురై ఆలయంలో ఆచారం.. బాలికలు అర్ధనగ్నంగా గడపాలి..

మదురైలోని ఆలయంలో సంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రస్తుతం వివాదాస్పదమైంది. మదురైలోని ఓ ఆలయంలో పూజారి పర్యవేక్షణలో బాలికలను అర్ధనగ్నంగా ఉంచే పురాతన ఆచారంపై కథనం ప్రచురించిన కోవై చెందిన ఓ వెబ్‌సైట్ ఎడిటర్‌క

మదురైలోని ఆలయంలో సంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రస్తుతం వివాదాస్పదమైంది. మదురైలోని ఓ ఆలయంలో పూజారి పర్యవేక్షణలో బాలికలను అర్ధనగ్నంగా ఉంచే పురాతన ఆచారంపై కథనం ప్రచురించిన కోవై చెందిన ఓ వెబ్‌సైట్ ఎడిటర్‌కు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. మదురై జిల్లాలోని వెల్లాలూర్ గ్రామంలోని ఓ ఆలయానికి చెందిన పూజారి 10-14ఏళ్లలోపు వున్న ఏడుగురు బాలికను 15రోజుల పాటు ఆలయంలో అర్ధనగ్నంగా గడిపేలా చేశారు. 
 
ఈ బాలికలు అందరూ దుస్తులు ధరించకూడదు. కేవలం ఆభరణాలతో మాత్రమే పై శరీరాన్ని కప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఆలయంలో అర్ధనగ్నంగా ఉండే బాలికలపై లైంగిక వేధింపులు కానీ, ఇతర వేధింపులు కానీ జరిగినట్టు ఇప్పటి వరకు సాక్ష్యాధారాలు లేవు. ఇది ఆలయ సంప్రదాయంగా వస్తోంది.

ఇందుకు సంబంధించిన కథనాన్ని వెబ్ సైట్ వీడియోతో సహా ప్రచురించడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.