శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 16 మే 2018 (16:42 IST)

ఆటో ఎక్కిన యువతిపై లైంగిక వేధింపులు.. ఆటో ఆపకపోవడంతో దూకేసింది..

మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. అకృత్యాల సంఖ్య మితిమీరిపోతున్నాయి. తాజాగా కోల్‌కతాలో లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి సాహసం చేసింది. ఆటోలో వెళ్తున్న ఓ యువతికి లైంగిక వేధింపులు ఎదురు

మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. అకృత్యాల సంఖ్య మితిమీరిపోతున్నాయి. తాజాగా కోల్‌కతాలో లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి సాహసం చేసింది. ఆటోలో వెళ్తున్న ఓ యువతికి లైంగిక వేధింపులు ఎదురు కావడంతో నడుస్తున్న ఆటోలో నుంచి దూకేసింది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఈ నెల మే-13వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు ఓ యువతి సౌత్ కోల్‌కత్తాలోని గరియహత్ ఏరియాలో ఆటో ఎక్కింది. అప్పటికే ఆటోలో యుగ్గురు యువకులు ఉన్నారు. దీంతో ఆ యువతి డ్రైవర్ ఎడమవైపు కూర్చొంది. ఆ యువతి ఆటోలో ఎక్కిన కొన్ని నిమిషాల్లోనే వెనుక వైపు కూర్చొన్న యువకులు టచ్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. 
 
దీంతో ఆ యువతి డ్రైవర్‌ను ఆటో ఆపాలని కోరింది. డ్రైవర్ ఆటో ఆపేందుకు నిరాకరించాడు. దీంతో సెలింపూర్ ఏరియాలో రోడ్డుపై వెళ్తున్న సమయంలో యువతి ఆటోలో నుంచి కిందకి దూకేసింది. తనను వేధింపులకు గురిచేసిన వారిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు.