శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: సోమవారం, 26 జనవరి 2015 (06:54 IST)

విందులో ఒబామా ఆరగించిందేంటి..? వెజ్జా.. నాన్ వెజ్జా..!

ప్రపంచ పెద్దన్న భారత పర్యటనకు వచ్చారు.. ఆయన ఎక్కడికెళ్ళినా ఏమి తినాలో నిర్ణయించేది ఆయన వెంట వచ్చే ఆంతరంగిక సిబ్బంది. అయితే ఆయన ఇష్టపడే వాటితోపాటు భారతీయ వంటకాలను ఆయనకు రుచి చూపించినట్లు తెలుస్తోంది. ఆయన ఏమి తిన్నారు..? ఎంతెంత తిన్నారు..? అనేది చాలా ఆసక్తికరమైన అంశంగా మారింది. 
 
ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ హౌజ్లో ఒబామా, మోదీలు కలసి భోజనం చేశారు. ఒబామా కోసం వెజ్ తో పాటు భారతీయ నాన్వెజ్ వంటకాలతో మోదీ విందు ఇచ్చారు. ఇందులో కశ్మీర్ వంటకం నడ్రు కె గూలర్, బెంగాల్ వంట మహి సర్సాన్తో పాటు షట్వార్ కా షోర్బా, అనానస్ ఔర్ పనీర్ కా సూలా, మటర్ పలావ్, గుజరాతీ కడీ, మిక్స్డ్ వెజిటబుల్ కలోంజి, కెలా మేథీ ను షాక్, పనీర్ లబబ్దార్, గాజర్ కా హల్వా, గులాబ్ జామూన్, పండ్లను సిద్ధంగా ఉంచారు. 
 
నాన్ వెజ్ లో ముర్గీ నెజా కబాబ్, శనగపిండితో చేసిన చికెన్, ఉడికించిన లేత గొర్రె ముక్కలు, భునా గోస్టు బోటీ, వండిన చేప వంటివి సర్వ్ చేశారు. ఒబామా ఏయే పదార్థాలను రుచి చూశారో బయటకు తెలియడం లేదు. వీటిలో కొన్ని వంటకాల గురించి ఒబామా ఆసక్తికరంగా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. వెజటేరియన్ అయిన మోదీ అతిథి ఇష్టాఇష్టాలను అనుసరించి నాన్ వెజ్ ను ఏర్పాటు చేస్తూనే భారతీయ వంటకాలను కూడా సిద్ధం చేయించారు. దక్షిణ భారత దేశంలో తాగే కాఫీ, హెర్బల్ టీని అందజేశారు.