లేడీ డాక్టర్ దుస్తులు మార్చుకుంది... మరో డాక్టర్ వీడియో తీశాడు.. అందరికీ షేర్ చేశాడు

హైదరాబాద్, శుక్రవారం, 16 జూన్ 2017 (05:01 IST)

rape victim

చదువూకున్నోళ్ల కన్న సాకలన్న మేలూ, అయ్యా నే సదువుకోను బోనే అంటూ ముప్పై ఏళ్ల క్రితం గద్దర్ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మొత్తంగా పాట పాడిన రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. చదువుకుంటే ఉన్న కాస్త మతి కూడా పోతుందనేది అందరి విషయంలోనూ వర్తించదేమో కానీ కొందరి విషయంలో మాత్రం నేటికీ ఇది వర్తిస్తూనే ఉంది. వైద్యులు నివాసం ఉండే క్వార్టర్స్‌లో తోటి మహిళా వైద్యురాలు దుస్తులు మార్చుకుంటూండగా వైద్య వృత్తిలోనే ఉన్న తోటి డాక్టర్ ఆ దృశ్యాన్ని వీడియో తీసి తన స్నేహితులందరికీ షేర్ చేసిన ఘటన ముంబై మహానగరంలో జరిగింది. 
 
విషయానికి వస్తే.. వైద్యులు నివాసముండే క్వార్టర్స్‌లో ఓ మహిళా డాక్టర్‌ దుస్తులు మార్చుకుంటుండగా అదే అంతస్తులో ఉన్న 29 ఏళ్ల వైద్యుడు వీడియో తీశాడు. దుస్తులు మార్చుకుంటున్న వీడియోను మహిళా డాక్టర్‌ స్నేహితురాళ్లు ఆమెకు చూపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తొలుత ఈ విషయాన్ని ఆమె స్నేహితురాళ్లు చెప్పినపుడు నమ్మలేకపోయినా.. వీడియో చూశాక నిర్ఘాంతపోయారు. 
 
దీంతో వెంటనే ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీయగా, చివరకు ఓ డాక్టర్‌ నుంచి వచ్చిందని తేలింది. దీంతో ఆమె ముంబయిలోని జుహూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. 354, 379, 66ఏ, 67ఏ సెక్షన్ల కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఎలాంటి వీడియోలు చిత్రీకరించలేదని ఆ డాక్టర్‌.. పోలీసులతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరి ఆ డాక్టర్ స్నేహితులకు ఆ వీడియోను అతడి ఫోన్ నుంచి షేర్ చేసిందెవరు? 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డిపై ఇండిగో, ఎయిర్ ఇండియా నిషేధం

విశాఖపట్నం విమానాశ్రయంలో సంస్థ ఉద్యోగిని వెనుకనుంచి పరుగెత్తుకుంటూ వెళ్లిన దివాకర్ రెడ్డి ...

news

ప్రేమించలేదని కత్తితో కోశాడు.. ఆ తరువాత(వీడియో)

ప్రేమించలేదనే కారణంగా ఒక యువతిపై కత్తితో దాడికి దిగాడు ఉన్మాది. ప్రాణపాయస్థితిలో యువతి ...

news

శిరీష పెదవులపై గాట్లు, తలపై గాయాలు... కొట్టి చంపి ఉరి వేశారా?, లింకుందన్న తేజస్విని ఎవరు?

బ్యూటీషియన్ శిరీష పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్టులో ఆమె మెడ ఎముక విరిగి ...

news

కన్నబిడ్డను కాటేశాడు.. పాఠశాలలో చేర్పిస్తానని లాడ్జిలో అత్యాచారం చేశాడు..

కన్నబిడ్డను కాటేశాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడిగా మారిపోయాడు. లాడ్జిలో ...