Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒంటరిగా వున్న మహిళలపై గ్యాంగ్ రేప్‌.. కాళ్లు కదపకుండా బండరాయిని?

సోమవారం, 27 నవంబరు 2017 (11:48 IST)

Widgets Magazine
gang rape

ఐటీ రాజధాని బెంగళూరులో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇళ్లల్లో ఉన్న మహిళలను గుర్తించిన కామాంధులు వారిపై సామూహిక అత్యాచారాలకు ఒడిగట్టిన ఘటన ఈ నెల 16న బెంగళూరు నగర శివారులోని నెలమంగళకు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాదనాయకహళ్లికి చెందిన కార్మికురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. 
 
కార్మికురాలి భర్త ఇంట్లో లేడనే విషయాన్ని గమనించిన రాజగోపాల్ నగర్‌కు చెందిన రౌడీ షీటర్ రాఘవేంద్ర అలియాస్ కుమార్ (32), లగ్గెరెకు చెందిన పునీత్ (22), లక్ష్మీపురానికి చెందిన వెంకటేశ్‌తోపాటు మరో ఇద్దరు కలిసి కార్మికురాలి ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ అత్యాచారం కార్మికురాలి భర్త కంట ముందే జరిగిందని పోలీసులు చెప్తున్నారు.
 
ఇదే విధంగా శుక్రవారం రాత్రి నేపాల్‌కు చెందిన యువతిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా వున్న ఆమెను కామాంధులు పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆపై ఆమె కాళ్లు కదపకుండా వుండేందుకు పెద్ద బండరాయిని ఉంచి పారిపోయారు. అయితే బాధితురాలు కేకలు విని స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోడ్డుపై జ్యోతిలక్ష్మి నడిచినా చూస్తారు.. జగన్ పాదయాత్ర వేస్ట్: జేసీ దివాకర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర వేస్ట్ అని ...

news

పాకిస్థాన్‌కు అజిత్ దోవల్ సీరియస్ వార్నింగ్

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయ్యద్‌ను గృహ నిర్భంధం నుంచి పాకిస్థాన్ కోర్టు విడిపించిన ...

news

నగరి నుంచి తిరుమల కొండ వరకు 88 కి.మీటర్లు.. రోజా పాదయాత్ర

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారుపై ఒత్తిడి తెచ్చే దిశగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ...

news

12ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష

మహిళలపై పెచ్చరిల్లుతున్న అరాచకాలకు మధ్యప్రదేశ్ సర్కారు సీరియస్‌గా తీసుకోనుంది. ...

Widgets Magazine