Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రపంచంలోనే ఫస్ట్ టైం : రెండో కాన్పులో ఇద్దరు.. మూడోసారి ముగ్గురు

సోమవారం, 20 నవంబరు 2017 (09:26 IST)

Widgets Magazine
baby

సాధారణంగా ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు, నలుగురు పుట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ప్రపంచంలోనే తొలిసారి రెండో కాన్పులో ఇద్దరు, మూడో కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారు. ఈ అరుదైన ప్రసవం అమెరికాలో చోటుచేసుకుంది. 
 
అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన రాబర్ట్‌, నియా దంపతులకు 2011లో షాయ్‌ అనే అబ్బాయి పుట్టాడు. నాలుగేళ్ల తర్వాత 2015లో మరో ఇద్దరు కవలలు రిలే, అలెగ్జాండర్‌ జన్మించారు. అనంతరం మళ్లీ గర్భం దాల్చిన నియా స్కానింగ్‌ కోసం స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. శిశువు పెరుగుదలను తెలుసుకోవడానికి ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ చేసినప్పుడే అక్కడి టెక్నీషియన్‌ ఒకటి కంటే ఎక్కువ మంది శిశువులు ఉండొచ్చని చెప్పినట్లు నియా వెల్లడించారు. 
 
అయితే, ఇలా ఒకేసారి ముగ్గురు మాత్రం పుడతారనుకోలేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకుముందు రాబర్ట్‌ ఇంత మంది పిల్లల్ని ఎలా పెంచాలంటూ కొన్ని సార్లు జోకులు వేసేవారని, దీనికి తోడు ఒక్కసారిగా మరో ముగ్గురు పిల్లలు తోడయ్యారని ఆమె చెప్పుకొచ్పారు. పిల్లలు పుట్టినందుకు ఒకింత సంతోషంగా ఉన్నప్పటికీ వీరిందరినీ ఎలా పోషించాలా అనేది ఆ దంపతులకు పెద్ద సమస్యగా మారింది. అయితే ఇలా జరగడం ప్రపంచంలోనే ఇదే ఫస్ట్ టైం అని వైద్యులు చెపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ ఆస్తులు రూ.5 లక్షల కోట్లా?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమెను అడ్డుపెట్టుకుని ...

news

శశి గ్యాంగ్ వల్లే అమ్మ నివాసంలో ఐటీ సోదాలు : మంత్రి జయకుమార్

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన కుటుంబ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి ...

news

'నువ్వే నా గురువు, మార్గదర్శకులు, నా బలం' : రాహుల్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నాన్నమ్మ, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ...

news

గన్ పాయింట్‌లో దోపిడీ.. (వీడియో)

దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు ఘోరాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇక్కడ ఇప్పటికే మహిళలకు ...

Widgets Magazine