ఉద్యోగం ఇప్పిస్తానని కారులో తీసుకెళ్లాడు.. మార్గమధ్యంలో రేప్.. నిర్భయ తరహాలో?
ఉత్తరప్రదేశ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ యువతిపై కారులోనే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో ఈ ఘోరం జరిగింది. నడుస్తున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడిన అతడు.. తన కో
ఉత్తరప్రదేశ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ యువతిపై కారులోనే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో ఈ ఘోరం జరిగింది. నడుస్తున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడిన అతడు.. తన కోరిక తీరగానే.. కారు నుంచి బయటకి తోసేశాడు. గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి స్థానికులు తరలించారు. వివరాల్లోకి వెళితే.. బాగ్‌పట్‌లో ఉన్న ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ పోలీసు సోదరుడు పిలిచాడు.
సైనికుడు కావటంతో.. ఆ మహిళ అతని మాట నమ్మింది. ఉపాధి దొరుకుతుందనే ఆశతో వచ్చిన ఆ మహిళను అతడు కారులో తీసుకెళ్లాడు. కానీ మార్గమధ్యంలోనే ఆమెపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై బాధితురాలిని ఢిల్లీ-సహరన్‌పూర్ హైవేపై విసిరేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన రేపిస్టు కోసం గాలిస్తున్నారు.