శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 మే 2016 (10:48 IST)

సోషల్ మీడియాలో బూతు పదాలను వాడటంలో పురుషుల కంటే స్త్రీలే టాప్!

పురుషులతో మహిళలు కూడా సమానం. తమకు కూడా అన్ని రంగాల్లో, అంశాల్లో సగభాగం కావాలంటూ మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా డిమాండ్ చేసే అంశాల్లోనే కాకుండా, బహిరంగంగా డిమాండ్ చేయలేని అంశాల్లో కూడా మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. 
 
ముఖ్యంగా ప్రపంచంలో సోషల్ మీడియాకు ఆదరణ నానాటికీ పెరిగిపోతోంది. అదేసమయంలో వీటి వ్యసనంలో పడి వక్రమార్గంలో పయనించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రధానంగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో అశ్లీల దృశ్యాలు చూడటం, బూతు పదాలను పురుషులు తెగ వాడేస్తుంటారు. వీరి కంటే కాస్త ఎక్కువగానే స్త్రీలు వాడుతున్నారు. ఈ విషయం బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ నిర్వహించిన విశ్లేషణలో తేలింది.
 
పురుషులతో సామానంగా మహిళలూ అసభ్య, అశ్లీల పదాలను వాడేస్తున్నారనీ, కొన్ని రకాల బూతు పదాలను వాడటంలో పురుషుల కంటే స్త్రీలే ముందున్నారని ఈ సర్వేలో తేలింది. బ్రిటన్‌కు చెందిన డెమోస్‌ గత మూడు వారాలుగా బ్రిటన్‌లోని యూజర్లు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తున్న కామెంట్లను విశ్లేషించింది.
 
మహిళలను కించపరిచే అసభ్య పదాలను వాడటంలో పురుషులతోపాటు సాటి స్త్రీలు కూడా ముందున్నారట. అలాగే సాటి మహిళలపై సెక్సీయెస్ట్‌ కామెంట్స్‌ చేయడానికి కూడా వారు వెనుకాడటం లేదట. గత మూడు వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా ట్వీట్‌ అవుతున్న వాటిల్లో సగటున రెండు లక్షల ట్వీట్లలో స్త్రీలను దూషించే పదాలు ఉన్నాయట. అవి వెంటనే దాదాపు ఎనభై వేల మందికి చేరుతున్నట్టు ఈ విశ్లేషణలో వెల్లడైంది.