శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (15:52 IST)

'జికా'తో అమెరికా వణుకుతోంది... 'జికా' వ్యాక్సిన్ మేకిన్ ఇండియా... హైదరాబాదులో రెడీ...

సుమారు 20 దేశాలను గడగడలాడిస్తున్న జికా వైరస్ మెల్లగా మరికొన్ని ప్రాంతాలకు పాకుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళనలో పడిపోయాయి. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకుగాను వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచ దేశాలు రంగంలోకి దిగాయి. ఐతే జికా వైరస్‌కు విరుగుడు మందును తాము కనుగొన్నట్లు హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ జికా వ్యాక్సిన్‌కి పేటెంట్‌ కూడా సాధించామని ప్రకటించడంతో ఇప్పుడు ఆశ్చర్యపోవడం ప్రపంచం వంతైంది.
 
ఈ వ్యాధి నిరోధానికి టీకా మందును కనుగొనేందుకు చాలా దేశాలు కిందామీదు పడతున్న తరుణంలో భారత్‌ బయోటెక్‌ చేసిన ప్రకటన ప్రపంచ వైద్యరంగంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జికా వ్యాక్సిన్‌ అంశమై ప్రభుత్వాన్ని సాయం కోరామనీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్ రంగంలో దిగి తమకు సాయం అందిస్తోందని భారత్‌ బయోటిక్ లిమిటెడ్‌ చైర్మన్‌ కృష్ణ తెలిపారు.
 
ఇదిలావుండగా ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ మాట్లాడుతూ... భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షలు పూర్తయిన తర్వాతనే దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. కాగా బాధితులకు ఈ మందును చేరవేసే విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.