శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: మంగళవారం, 27 జనవరి 2015 (07:37 IST)

ఆహా... అద్భుతం... ఆశ్చర్యం.. ఇక నేను బైకు నడపాలా..? : ఒబామా కితాబు

అద్భుతం.. ఆ విన్యాసం. ఆశ్చర్యం... ఇలాంటి విన్యాసాలు చూసిన తరువాత ఇక బైకు నడపాలనిపించలేదు. ఇక ఎప్పుడూ నడపనేమో... ఇలా వ్యాఖ్యనించింది మరెవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. భారత గణతంత్ర వేడుకలలో బిఎస్ఎఫ్ జవాన్ల విన్యాసాలను చూసి ఆయన ఏం వ్యాఖ్యానించారు.? 
 
గణతంత్ర దినోత్సవ పెరేడ్ సందర్భంగా భారత సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్)కు చెందిన 'జాన్‌బాజ్' బృందం మోటార్‌సైకిళ్లపై చేసిన విన్యాసాలు పెద్దన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అమితంగా ఆకట్టుకున్నాయి. అద్భుతం.... అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఎస్ఎఫ్ బృందం  బైక్స్‌పై వెళుతూ మానవ పిరమిడ్‌లా ఏర్పడిన విన్యాసం, ఒళ్లు గగుర్పొడిచే  ఎన్నో విన్యాసాలను ఒబామా దంపతులు ఆద్యంతం ఆసక్తిగా వీక్షించారు. చప్పట్లతో, బొటనవేలితో థమ్స్‌అప్ చిహ్నాలు చూపుతూ ప్రోత్సహించారు. 
 
అనంతరం భారత్, అమెరికా వ్యాపార సంస్థల సీఈఓల భేటీలో బీఎస్‌ఎఫ్ జవాన్ల అద్భుత విన్యాసాలను ఒబామా ప్రస్తావించారు. వారి సాహసోపేత విన్యాసాలను చూసిన తరువాత  తానిక బైక్‌ను నడపబోనని ఒబామా వ్యాఖ్యానించడం విశేషం.