శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 31 జులై 2016 (12:01 IST)

ఫేస్ బుక్‌‍లో ప్రొఫైల్ పిక్చర్‌గా అమ్మాయిల ఫోటో: కావ్యా మాధవన్ పేరుతో.. 12 అకౌంట్లు!

ఫేస్ బుక్ మోసాలు తారాస్థాయికి చేరాయి. ఫేస్‌బుక్‌లో మోసగాళ్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. అమ్మాయిల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకుని మోసం చేసేవారి సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. తాజాగా కొచ్చిలో ఒక

ఫేస్ బుక్ మోసాలు తారాస్థాయికి చేరాయి. ఫేస్‌బుక్‌లో మోసగాళ్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. అమ్మాయిల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకుని మోసం చేసేవారి సంఖ్య పెచ్చరిల్లిపోతోంది.

తాజాగా కొచ్చిలో ఒక అమ్మాయి ఫోటోతో ఏకంగా 12 ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌ను మోసగించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
వివరాల్లో వెళితే... పంథలంలో నివాసముండే అరవింద్ బాబు అనే వ్యక్తి కావ్యా మాధవన్ అనే పేరుతో ఓ యువతి ఫోటోతో కూడిన 12 ఫేక్ ఫేస్‌‌బుక్ అకౌంట్లను క్రియేట్ చేశాడు. గత నాలుగేళ్లుగా అందరితో చాటింగ్ చేస్తూ వచ్చాడు.
 
ఇక్కడ ట్విస్టేంటటే.. కావ్యామాధవన్ అనే యువతి అరవింద్‌కు తెలిసిన అమ్మాయే. కానీ తన వ్యక్తిగత జీవితానికి చెడ్డపేరు తెచ్చేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని కావ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ అరవిందే ఈపని చేశాడని ఆమెకు తెలియదు. ఇక పోలీసుల విచారణలో మోసగాడు అరవిందేనని తేలిపోయింది. సైబర్‌క్రైమ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.