శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By Selvi
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (13:01 IST)

నవరాత్రి స్పెషల్ : కట్టె పొంగలి ఎలా చేయాలి..

ముందుగా కుక్కర్లో బియ్యం, పెసరపప్పును కడిగి రెండింతలు నీరు పోసి ఉడికించుకోవాలి. రెండు లేదా నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి. వెడల్పాటి బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక మిరియాలు, జీలకర్ర, అల్లం, జీడిపప్పు

నవరాత్రి సందర్భంగా కట్టె పొంగలిని దుర్గాదేవికి సమర్పిస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. అలాంటి కట్టె పొంగలిని ఎలా తయారు చేయాలో చూద్దాం.. 
 
కావలసిన  పదార్థాలు :
బియ్యం : ఒక కేజీ 
మిరియాల పొడి - ఒక స్పూన్ 
పెసర పప్పు- అరకేజీ 
అల్లం తురుము- ఒక స్పూన్
పంచదార - అరస్పూన్ 
ఉప్పు- అరస్పూన్ 
జీడిపప్పు- వంద గ్రాములు 
నెయ్యి- వంద గ్రాములు 
తాలింపుకు- జీలకర్ర, మిరియాలు ఒక స్పూన్ 
 
తయారీ విధానం :
ముందుగా కుక్కర్లో బియ్యం, పెసరపప్పును కడిగి రెండింతలు నీరు పోసి ఉడికించుకోవాలి. రెండు లేదా నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి. వెడల్పాటి బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక మిరియాలు, జీలకర్ర, అల్లం, జీడిపప్పు వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత మిరియాల పొడిని, జీలకర్ర పొడిని కూడా చేర్చుకోవాలి. ఇందులో ఉడికించిన అన్నాన్ని చేర్చుకోవాలి. ఉప్పు, పంచదార వేసి బాగా కలపాలి. చివర్లో రెండు స్పూన్ల నెయ్యిని చేర్చి దించేయాలి. ఆరిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి.