శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2015 (17:34 IST)

హెల్దీ స్నాక్స్ : చికెన్ గారెల్ని ఎలా చేయాలో తెలుసా?

హెల్దీ స్నాక్స్‌ చికెన్ గారెల్ని ఇంట్లోనే ట్రై చేయడం ఎలాగో తెలుసుకోండి. పిల్లలు వీటిని తెగ ఇష్టపడి తింటారు.
 
కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్ చికెన్ - అర కేజీ
శనగపప్పు - నాలుగు కప్పులు 
గరం మసాలా - నాలుగు టీ స్పూన్లు 
పసుపు - చిటికెడు
కొత్తిమీర తరుగు - అర కప్పు, 
కారం - ఒక టీ స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు 
పచ్చి మిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు 
ఉల్లి తరుగు - అర కప్పు 
నూనె, ఉప్పు -  తగినంత 
 
తయారీ విధానం:
ముందుగా గారెలకు శనగప్పును నానబెట్టుకుని.. గారెలకు తగినట్లు రుబ్బుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలకు కారం, గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు చేర్చి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. రుబ్బుకున్న శనగపప్పు ముద్దకు ఉల్లి, పచ్చిమిర్చి, ఉడికించిన చికెన్, మసాలా కాసింత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ గారెల మిశ్రమాన్ని వేడైన నూనెలో దోరగా వేపుకుంటే చికెన్ గారెలు రెడీ అయినట్టే.