శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By CVR
Last Updated : సోమవారం, 8 డిశెంబరు 2014 (17:30 IST)

రుచికరమైన ఎగ్ బిరియానీ

కావలసిన పదార్థాలు :
బాస్మతి రైస్ - రెండు కప్పులు
కోడిగుడ్లు - ఎనిమిది (ఉడికించినవి)
నూనె లేదా నెయ్యి - అర కప్పు
నీళ్లు - రెండున్నర కప్పులు
ఉల్లిపాయ - పెద్దది ఒకటి
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు
పులావ్ ఆకులు - రెండు
దాల్చిన చెక్క - చిన్నది
యాలకులు - నాలుగు
పసుపు - అర టీస్పూన్
కారం - అర టీ స్పూన్
గరంమసాలా పొడి - ఒక టీ స్పూన్
కొత్తిమీర తురుము - 4 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
 
తయారుచేయండి ఇలా: మొదట నూనె లేదా నెయ్యి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. రెండు నిమిషాలు వేయించిన తరువాత పులావ్ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు కూడా వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాలి. తరువాత కోడిగుడ్లు, కారం, పసుపు వేయాలి. కోడిగుడ్లు రంగు మారిన తరువాత అందులో బియ్యాన్ని వేయాలి. రెండు నిమిషాలు అలాగే వేయించాక నీటిని పోయాలి.
 
ఇప్పుడు తగినంత ఉప్పు, గరంమసాలా పొడి చల్లి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. ఒక పొంగు వచ్చాక మీడియం మంటమీద ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయి అన్నం తయారయ్యాక కొత్తిమీర తురుము చల్లి దించేయాలి. ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే ఏదేని కుర్మాతో కలిపి సర్వ్ చేయాలి.