శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By CVR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (09:29 IST)

శక్తివంతమైన బ్రేక్‌ఫాస్ట్ ఎగ్ పరాటా

కావల్సిన పదార్థాలు :
గుడ్డు - 1 ( రెండు పరాటాలకు)
గోధుమ పిండి లేదా మైదా పిండి - 1 కప్పు
టమోటా - 1
ఉల్లిపాయ - 1
కొత్తిమీర - 1 కట్ట
పచ్చిమిర్చి - 1
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర టీస్పూను
చాట్ మసాలా - అర టీ స్పూను
ధనియాలపొడి - అర టీ స్పూను
జీరా పొడి - అర టీ స్పూను
నూనె - పరాటాలు కాల్చడానికి సరిపడా
 
తయారు చేయండి ఇలా : మొదట గోధుమ లేదా మైదా పిండిలో సరిపడా నీరు పోసి ముద్దలా చేసుకుని అర గంట నాన బెట్టాలి. మరో వైపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటాలను సన్నగా తరిగి ఒక పాత్రలో వేసి గుడ్డుతో పాటు మిగతా పొడులు, కొత్తమీర, ఉప్పు వేసి బాగా గిలకొట్టి పక్కనుంచాలి. అప్పుడు సరిపడా పిండి ముద్దని తీసుకుని గుండ్రంగా రుద్దుకుని, తర్వాత పొడిపిండి కొద్దిగా చల్లుతూ త్రికోణంలా మడతపెట్టి సాగదీయాలి. తర్వాత పెనంపై వేసి సన్నని మంటపై కాలిస్తే ఒక వైపు పొంగుతుంది. పొంగిన వైపు కత్తితో కట్ చేసి, అందులో గుడ్డు మిశ్రమాన్ని స్పూనుతో పలచగా రుద్ది, అంచును ఒత్తాలి. తర్వాత గుడ్డు పచ్చి వాసన పోయే దాకా రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన ఎగ్ పరాటా రెడీ. బ్రేక్ ఫాస్ట్ ఇష్టపడని పిల్లలు సైతం వీటిని ఇష్టంగా ఆరగిస్తారు.