శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : శనివారం, 8 డిశెంబరు 2018 (13:12 IST)

టేస్టీ టేస్టీ మటన్ ఎండుముక్కలు కూర ఎలా చేయాలో తెలుసా..?

తాజా మటన్‌లో కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి వేసి కలిపి ఎండలో మూడురోజుల పాటు ఎండపెట్టుకోవాలి. ఇలా చేసిన వాటినే ఎండుముక్కలు ఉంటారు. ఈ ముక్కలతో కూర ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
ఎండుముక్కలు - 1 కప్పు
ఎండుమిర్చి - 5
ధనియాలు పొడి - 2 స్పూన్స్
ఎండుకొబ్బరి - చిన్నముక్క
ఉల్లిపాయ - 1
టమోటాలు - 2
ఉప్పు - తగినంతా
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా ఎండుముక్కలు కాకుండా మిగిలిన వాటిని దోరగా వేయించి దంచి పెట్టుకోవాలి. చివరగా ఎండుముక్కలు వేసి దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఎండుముక్కలు వేసి దానికి తగిన నీరు పోసి ఉడికించుకోవాలి. ఆపై నాలుగైదు విజిల్స్ వచ్చిన తరువాత దింపుకోవాలి. అంతే... వేడివేడి ఎండుముక్కల కూర రెడీ.